BigTV English

Free current: ఉచిత కరెంట్ పొందాలంటే ఇవి తప్పనిసరి.. విద్యుత్ శాఖ కీలక ప్రకటన..!

Free current: ఉచిత కరెంట్ పొందాలంటే ఇవి తప్పనిసరి.. విద్యుత్ శాఖ కీలక ప్రకటన..!

Free electricity through Gruha Jyoti Scheme: గృహజ్యోతి పథకం లబ్ధిదారులు తప్పనిసరిగా ఆధార్ ధ్రువీకరణ చేయించుకోవాలని తెలంగాణ విద్యుత్ శాఖ తేల్చి చెప్పింది. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. బయోమెట్రిక్ విధానంలో ఈ వ్యాలిడేషన్ పూర్తి చేస్తేనే ఉచిత కరెంట్ పథకంలో పేర్లు నమోదవుతాయని వెల్లడించింది.


ఆధార్ వేరిఫికేషన్ ప్రాసెస్‌లో డిస్కంలు చేపట్టాలని విద్యుత్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. లబ్ధిదారులు తమ పేర్లు నమోదు చేసుకునేందుకు ఇంటి కరెంట్ కనెక్షన్ ఎవరి పేరు మీద ఉందో వారి ఆధార్‌ను సిబ్బందికి తెలియజేయాలని వెల్లడించింది. ఎవరికైనా ఆధార్ లేకపోతే వెంటనే తీసుకుని.. ఆ తక్షణం దరఖాస్తు చేసుకొని.. ఆ ప్రూఫ్ చూపించాలని వెల్లడించింది. అయితే ఆధార్ జారీ అయ్యేవరకూ ఇతర గుర్తింపు కార్డులను వినియోగించవచ్చని పేర్కొన్నది.

బ్యాంకు, పోస్టాఫీసు పాస్‌బుక్‌లో ఖాతాదారుడి ఫొటోతో ఉన్న జిరాక్స్, పాన్‌కార్డు, ఓటరు గుర్తింపు కార్డు, ఉపాధి హామీ పథకం గుర్తింపు కార్డు, కిసాన్ పాస్‌బుక్, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డు, ఎవరైనా గెజిటెడ్ అధికారి, ఎమ్మార్వో ఇచ్చిన ధ్రువీకరణ పత్రం వంటి వాటిల్లో ఏదైనా విద్యుత్ సిబ్బందికి చూపి పేర్లు నమోదు చేసుకోవాలని వెల్లడించింది.


బయోమెట్రిక్ వ్యాలీడెషన్ లో భాగంగా వేలిముద్ర లేకుంటే కనురెప్పలను స్కాన్ చేయాలని విద్యుత్ శాఖ తన ఆదేశాల్లో తెలిపింది. డిస్కంలే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని సూచించింది. పరికరాలు పనిచేయకపోతే ఆధార్ నంబర్‌ను నమోదు చేయగానే దాని యజమాని సెల్‌ఫోన్‌కు వచ్చే ఓటీపీ ద్వారా ధ్రువీకరించాలని తెలిపింది. అది కాకపోతే, ఆధార్ కార్డుపై ఉండే క్యూఆర్‌కోడ్‌ను స్కాన్ చేసి వివరాలు తెలుసుకోవాలని మార్గదర్శకాలను జారీ చేసింది.

ఈ పథకం అమలు కోసం ఎప్పటికప్పుడు జారీ చేసే ఉత్తర్వుల్లోని నిబంధనల మేరకు లబ్ధిదారులను ఎంపిక చేయాలని డిస్కంలను విద్యుత్ శాఖ ఆదేశించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తొందరలోనే వెలువడే అవకాశం ఉంది.

Tags

Related News

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Big Stories

×