E-Paper
Advertisement

Retd IAS AK Goel : ఐటీ, ఈసీ సోదాలపై స్పందించిన ఏకే గోయల్.. “వాళ్లపై కేసులు వేస్తా”

Retd IAS AK Goel : ఐటీ, ఈసీ సోదాలపై స్పందించిన ఏకే గోయల్.. “వాళ్లపై కేసులు వేస్తా”
Advertisement

Retd IAS AK Goel : తన ఇంట్లో ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్యాడ్ టాస్క్ ఫోర్స్ తనిఖీలపై మాజీ ఐఏఎస్ అధికారి ఏకే గోయల్ స్పందించారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల ఫిర్యాదుతో శుక్రవారం హైదరాబాద్ లోని ఏకే గోయల్ ఇంట్లో ఎలక్షన్ ఫ్లైయింగ్ స్క్యాడ్ టాస్క్ ఫోర్స్ తనిఖీలు చేపట్టింది. తన ఇంట్లో అక్రమ డబ్బు, మద్యం ఉన్నాయని ఫ్లైయింగ్ స్క్వాడ్ అధికారులు తనిఖీలు చేసేందుకు వచ్చారు వారికి పూర్తిగా సహకరించానని తెలిపారు.

తన ఇంట్లో ఎలాంటి అక్రమ డబ్బు, మద్యం గుర్తించలేదన్నారు ఏకే గోయల్. తన ఇంట్లో అక్రమ డబ్బు, మద్యం ఉన్నాయని తనపై ఆరోపణలు చేసి తన పరువుకు భంగం కలిగించారంటూ ఆరోపించారు. తన ఇంట్లో అక్రమ మధ్యం, డబ్బు ఉందంటూ హడావిడి చేసిన కాంగ్రెస్ నేతలపై పరువు నష్టం దావా వేస్తానని ఏకే గోయల్ అన్నారు.

Advertisement

మాజీ ఎంపీలు మల్లు రవి, అజారుద్దీన్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి విజయ రెడ్డిపై కోర్టులో కేస్ వేస్తానని చెప్పారు గోయల్‌. తన ఇంట్లో కాంగ్రెస్ నాయకులు చేసిన విధ్వంసం వీడియోలు సహా ఆధారాలు ఉన్నాయని, వాటన్నింటినీ కోర్టుకు అందజేస్తానని తెలిపారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోర్టును ఆశ్రయిస్తానని పేర్కొన్నారు. అయితే గోయల్ తన ఇంట్లో తనిఖీలకు అధికారులను అనుమతించలేదు. తిరిగి ఇప్పుడు కాంగ్రెస్‌ నేతలపైనే కేసులు వేస్తానని చెప్పడంపై కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారు.

Tags

Related News

బీజేపీలోకి కొండా సురేఖ.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ డీకే అరుణ!

కాన్‌స్టర్ సొల్యూషన్స్ ప్రారంభోత్సవంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!

కామారెడ్డి జిల్లాలో ఘోరం.. ఆర్టీసీ బస్సు బోల్తా స్పాట్‌లో 13 మంది..!

మాదాపూర్‌లో ఈ-సిగరెట్ల దందా గుట్టురట్టు.. పోలీసులకు ఎలా చిక్కారంటే..?

ఖమ్మం జిల్లాలో చైనా సైబర్ గ్యాంగ్ దందా కలకలం.. 52 మంది యువకులు అరెస్ట్!

కేసీఆర్‌కు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్..!

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

Big Stories

Advertisement
×