E-Paper
Advertisement

22A నిషేధిత భూములపై సీఎం క్లారిటీ.. అసెంబ్లీలో బిఆర్‌ఎస్ నేతలపై రేవంత్ ధ్వజం!

22A నిషేధిత భూములపై సీఎం క్లారిటీ.. అసెంబ్లీలో బిఆర్‌ఎస్ నేతలపై రేవంత్ ధ్వజం!
Advertisement

22A Lands: కేసీఆర్‌కు అన్ని తెలుసు అందుకే ఆయన బయటికి రావడం లేదు. ఇవన్నీ వివరాలు ఆయన ముందు సభలో చెప్పాలని నేను అనుకున్న అందుకే ఆయన సభకి రావడం లేదు. మిగతా వారు సభలో గందరగోళం సృష్టించి వారు సస్పెండ్ అయ్యారని అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. కేసీఆర్ కావాలనే సభకు రావడం లేదని అన్నారు. మీరు సభకు ఆయనను పట్టుకుని రమ్మని ఆదేశాలు ఇస్తే తప్ప ఆయనను సభకు తీసుకుని రాలేము అధ్యక్ష అంటూ కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు.

Nac కి భూముల వివరాలు..

తెలంగాణలో భూముల విషయంలో ఇంత జరిగితే విచారణ ఎందుకు చేయకూడదని అన్నారు. Nac కి భూముల వివరాలు ఎందుకు ఇవ్వలేదుని, పార్ట్ బి భూములు నిషేధిత జాబితాలో పెట్టారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వంలో 21లక్షల ఎకరాలు భూములు నిషేధిత జాబితాలో ఉంచారని, ధరణి నీ అడ్డం పెట్టుకుని brs వాళ్ళు దండుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

అందుకే కేసీఆర్ రావట్లేదు..

Advertisement

22/A అసైన్డ్ భూములు 21 లక్షల ఎకరాలు. అటవీ భూములు 42 లక్షల ఎకరాలు. దాదాపుగా 98 లక్షల ఎకరాలు నిషేధిత జాబితాలో ఉన్నాయని సీఎం తెలిపారు. 3 లక్షల 73 వేల ఎకరాలు ప్రయివేట్ భూములు నిషేధిత జాబితాలో ఉన్నాయన్నారు. రాష్ట్రంలో కోటి ఎకరాలు నిషేధిత జాబితాలో ఉండాలని, ఇవన్నీ ఫారెస్ట్, ఎండోమెoట్, శిఖం, ప్రభుత్వ భూములు నిషేధిత జాబితాలో ఉండాలని సీఎం అన్నారు. ఇవన్నీ అడుగుతా కనుకే ముఖా అసెంబ్లీకి కూడా కేసీఆర్ రాలేదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇక్కడ దళితుడు స్పీకర్ అయ్యాడని అసెంబ్లీకి కేసీఆర్ రాలేదు. ముఖా అసెంబ్లీలో కూడా దళితుడు స్పీకర్ కాబట్టి అక్కడికి కూడా కేసీఆర్ రాలేదని దీనికి హరీష్ రావు సమాధానం చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఎండోమెంట్, ప్రభుత్వ, ఫారెస్ట్ భూములను నిషేధిత జాబితా నుండి తొలగించాలని హరీష్ రావు సమాధానం అంటున్నారు వీటంన్నింటికి హరీష్ రావు సమాదానం చెప్పాలని హరీష్ రావును సీఎం రేవంత్ కోరారు.

Also read: మహిళలకు గుడ్‌న్యూస్.. ఇందిరమ్మ కుట్టు మిషన్ దరఖాస్తు గడువు పొడిగింపు!

కలెక్టర్లకు అధికారం..

Advertisement

కొత్తగా మా ప్రభుత్వం 22aలో భూములు చేర్చలేదని సీఎం రేవంత్ క్లారిటీ ఇచ్చారు. కలెక్టర్ సబ్ కలెక్టర్ మాత్రమే 22a చేర్చుతారని, సర్వే నంబర్‌లో ఒక ఎకరం ప్రభుత్వ భూమి అయితే ఆ నెంబర్‌లో ఉన్న ఒక ఎకరం మాత్రమే నిషేధిత జాబితాలో ఉంచుతారని సీఎం క్లారిటీ ఇచ్చారు. ఎవరి ఆస్తి అయిన నిషేధిత జాబితాలో పెడితే 15 రోజులు సమయం ఇచ్చి పత్రాలు పరిశీలన చేసి నిషేధిత జాబితా నుండి తొలగిస్తామని ఇది ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న పని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

అధికారులు సస్పెండ్..

చాలా మంది రైతుల భూములను నిషేధిత జాబితాలో పెట్టడంతో చాలా మంది ప్రజలు ఇబ్బంది పడ్డారని అన్నారు. ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులకు రిజిస్ట్రేషన్ చేసిన వారిని నలుగురిని సస్పెండ్ చేశారని సీఎం తెలిపారు. అయితే పిర్యాదు చేసిన దాంట్లో brs మేలు మర్రి రాజశేఖర్ రెడ్డి ఉన్నారని, మర్రి రాజశేఖర్ రెడ్డి రెవెన్యూ మంత్రికి పిర్యాదు చేశారని తెలిపారు. సర్వే నెంబర్‌లో ఒక ఎకరం ప్రభుత్వ భూమి ఉంటే మొత్తం సర్వే నెంబర్‌ను నిషేధిత జాబితాలో ఉంచారని అన్నారు. ఇలా కొంత మంది అధికారుల వలన ఇలాంటి ఇన్సిడెంట్లు జరిగాయని సీఎం తెలిపారు.

7లక్షల ఎకరాలు..

వారు దోపిడి చేసిన భూములు బయటికి రాకుండా ఉండడానికి ఇలా చేశారని సీఎం ఫైర్ అయ్యారు. Brs హయంలో 7లక్షల ఎకరాలు నిషేధిత జాబితాలో ఉన్నాయి. మా ప్రభుత్వంలో 3 లక్షల ఎకరాలు నిషేధిత జాబితా నుండి తొలగించామని సీఎం క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం 3 లక్షల ఎకరాలు నిషేధిత జాబితాలో ఉన్నాయని త్వరలో వాటి క్లియర్ చేస్తామని తెలిపారు. మంత్రి నా ఇల్లు నిషేధిత జాబితాలో ఉంచుతారా.. ఉంచితే వారు అక్కడ మంత్రిగా కొనసాగుతారా.. టెక్నికల్ ఎర్రర్‌తో ఆ భూములు నిషేధిత జాబితాలో అలా చూపించిందని మాట్లాడారు.

Also read: నోటి దూలతో కొంపముంచుకున్నారా.. ఆ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడిపై కేసీఆర్ వేటు..?

Tags

Related News

దిల్‌సుఖ్‌నగర్ బహార్ బిర్యానీ కేఫ్‌పై ఫుడ్ సేఫ్టీ దాడులు.. 50 కేజీల కుళ్లిన చికెన్, మటన్ స్వాధీనం!

ఖమ్మం జిల్లాలో ఘోరం.. మైనర్ల వేధింపులు తట్టుకోలేక యువతి సూసైడ్!

మహిళలకు గుడ్‌న్యూస్.. ఇందిరమ్మ కుట్టు మిషన్ దరఖాస్తు గడువు పొడిగింపు!

ట్రేడ్ లైసెన్స్ పేరుతో దోపిడీ.. పట్టుకుని పోలీసులకు అప్పగించిన యువకులు!

వీడెవడండి బాబు.. ఏకంగా పెళ్ళాం ముక్కు కొరికేశాడు, మంచిర్యాలలో దారుణం

ట్రాఫిక్‌కు చెక్.. హైదరాబాద్ సిటీ చుట్టూ నాలుగు బస్సు టెర్మినల్స్, ఎక్కడెక్కడంటే

కర్ణాటక నుంచి నైరుతి బంగాళాఖాతం వరకు.. రానున్న మూడు రోజులు తెలంగాణలో భారీ వర్షాలు

Big Stories

Advertisement
×