E-Paper
Advertisement

ఇరుముడి దెబ్బకు శివ నిర్వాణ రేంజ్ మారిపోయిందా.. ఏకంగా చిరంజీవితో?

ఇరుముడి దెబ్బకు శివ నిర్వాణ రేంజ్ మారిపోయిందా.. ఏకంగా చిరంజీవితో?
Advertisement

Shiva Nirvana Next Movie:ఇరుముడి …అర హిట్టుకి అరడజన్ ప్లాపులకి మధ్య ఊగిసలాడుతున్న టాలీవుడ్ కి ఊపిరిపోసిన సినిమా ఇది.ఇక ఎన్నాళ్లగానో సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న మాస్ మహారాజుకి సాలిడ్ బ్లాక్ బస్టర్ అందించిన సినిమా కూడా ఇదే.అలాంటి సినిమా కి దర్శకత్వం వహించిన శివ నిర్వాణ గురించి ఇపుడొక క్రేజీ న్యూస్ తెగ వైరల్ అవుతుంది.అవును .శివ నిర్వాణ తన నెక్స్ట్ ఫిలిమ్ టాలీవుడ్ టాప్ హీరోతో ఉండబోతుందన్న టాక్ వినిపిస్తుంది.

ఏకంగా 230 కోట్ల వసూళ్ళు 

విషయం లోకి వెళ్తే ఎవరూ ఊహించని విధంగా ఏకంగా 230 కోట్ల వసూల్లని కొల్లగొట్టిన ఇరుముడి సినిమాకి దర్శకత్వం వహించిన శివ నిర్వాణ తన నెక్స్ట్ సినిమాని టాలీవుడ్ మెగా స్టార్ చిరంజీవితో చేయబోతున్నాడన్న వార్తలు ఇపుడు ఫిలిమ్ సర్కిల్స్ లో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

చిరుతో సినిమా ?

Advertisement

నిజానికి నిన్ను కోరి, మజిలీ, టక్ జగదీశ్ వంటి సినిమాలు చేసిన శివ నిర్వాణ అయితే చిరుతో సినిమా ఎలా తీస్తాడా అన్న అనుమానం కలగడం.కానీ రవితేజ తో చేసిన ఇరుముడితో ఆ అనుమానాలన్నీ పటా పంచలు చేసేశాడు.ఒక స్టార్ హీరోతో ఎలాంటి సినిమానైనా కమర్షియల్ గా డెలివర్ చేయగలనని ప్రూవ్ చేశాడు.పైగా ఈ మధ్యనే ఇరుముడి సినిమా యూనిట్ ని చిరు తన ఇంటికి పిలిపించుకుని తన విషెస్ చెప్పాడు కూడా.దీంతో శివ నిర్వాణ నిజంగానే చిరు తో సినిమా ఏమైనా చేస్తున్నాడా అన్న అనుమానాలకి బలం చేకూరింది.

తన బుట్టలో వేసుకుంటాడా

అయితే ఇలా చిరుతో ఇలా సినిమా చేస్తున్నారు అంటూ చాలా మంది డైరెక్టర్స్ పేర్లు వినబడి ఆ తర్వాత చేయకుండా సైలెంట్ సైడ్ అయినవాళ్ళు చాలా మందే ఉన్నారు.మరి ఈ లిస్టు లో శివ నిర్వాణ చేరతాడా లేక నిజంగానే వినిపిస్తున్నట్టుగా ఒక సాలిడ్ సబ్జెక్ట్ తో చిరుని తన బుట్టలో వేసుకుంటాడా అనేది కాలమే డిసైడ్ చేయాలి.

 18న నెట్ ఫ్లిక్స్ లోకి డిజిటల్ స్ట్రీమింగ్

Advertisement

ఇక ఇరుముడి సినిమా విషయానికి వస్తే..మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఆగస్ట్ 21న చ్చిన ఈ సినిమా కేవలం 35 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి ఏకంగా 230 కోట్ల రూపాయలని కొల్లగొట్టింది.ఇక ఒకవైపు థియేటర్ లలో జోరు చూపిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 18న నెట్ ఫ్లిక్స్ లోకి డిజిటల్ స్ట్రీమింగ్ అయ్యేందుకు రెడీ కావడం విశేషం.

ALSO READ:బిగ్ బాస్ హౌస్‌లో ప్రతి మాట ఎలా రికార్డ్ అవుతుందో తెలుసా?

చూడాలి మరి టాలీవుడ్ కి ఊపిరిపోసిన ఇరుముడి సినిమాకి దర్శకత్వం వహించిన శివ నిర్వాణ మరి నిజంగానే చిరుతో జోడీ కడతాడా లేక రూమర్స్ కే ఈ వార్త పరిమితం అవుతుందా కాలమే డిసైడ్ చేయాలి !

Tags

Related News

వేల కోట్ల స్కామ్.. ఇప్పుడు పూట గడవడం లేదు.. ఆర్థిక కష్టాల్లో ఐబొమ్మ రవి!

లండన్ లో జంటగా త్రిష విజయ్..త్రిష స్థానంలో నేనుంటే ఆ పని చేయను.. నటి ఫైర్!

శ్రీహరి కొడుకు మేఘాంశ్ ‘ఆస్మాన్ ‘ టీజర్ రిలీజ్!

10 ఏళ్ల తర్వాత పెళ్లి పీటలెక్కిన నటి అహానా కృష్ణ.. వరుడు ఎవరంటే?

చిన్నారి మృతి.. ఎమోషనల్ పోస్ట్ పెట్టిన నటి పూర్ణ!

Suriya – Jyotika: 20 ఏళ్ల తర్వాత మళ్లీ పెళ్లి.. ఇది అస్సలు ఊహించలేదు మావా..!

సాయి పల్లవి కోసం.. ‘రామాయణ్’ సాంగ్‌లో ఆ నటిని బ్లర్ చేశారా?

Big Stories

Advertisement
×