E-Paper
Advertisement

ఖమ్మం జిల్లాలో ఘోరం.. మైనర్ల వేధింపులు తట్టుకోలేక యువతి సూసైడ్!

ఖమ్మం జిల్లాలో ఘోరం.. మైనర్ల వేధింపులు తట్టుకోలేక యువతి సూసైడ్!
Advertisement

Khammam Girl: ఖమ్మం నగరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో మైనర్ బాలికను ఓ ఇద్దరు మైనర్ యువకులు బాలికను వేదించారు. దీంతో యువకుల వేదింపులు భరించలేక నేడు యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటనల జిల్లా వ్యాప్తంగా కలకలం రేపుతుంది. ఖమ్మం నగరంలో కె.సి.ఆర్ టవర్స్‌లో బాలిక నివాసం ఉంటుంది. రోటరీనగర్‌లోని సూపర్‌మార్కెట్‌లో సెల్స్‌గర్ల్‌గా ఆ బాలిక పనిచేస్తుంది. అయితే అదే ప్రాంతానికి చెందిన పవన్‌ అనే యువకుడు బాలికతో పరిచయం పెంచుకుని ప్రేమిస్తున్నానంటూ వేదించేవాడు.

బాలిక ఫొటోను సెల్‌ఫోన్‌‌లో..

యువతి పవన్ ప్రేమను తిరస్కరించింది. దీంతో ఆ తర్వాత బాలికను పంవన్ మరింత వేధింపులకు గురిచేసినట్టు అక్కడి స్థానికులు తెలిపారు. దీంతో పవన్ అతని స్నేహితుడు అమన్ సైతం బాలికను వేధించినట్లు పోలీసుల ఫిర్యాదులో పేర్కోన్నారు. యుతిని లొంగదీసుకునే ప్రయత్నం యువకులు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే వారం రోజుల క్రితం బాలిక ఫొటోను సెల్‌ఫోన్‌‌లో ఎడిట్ చేసి ఇబ్బందులకు గురిచేసినట్లు ఆరోపణలు వచ్చాయి.

Advertisement

Also read: రైతుబిడ్డ ఝాన్సీ పై ట్రోల్స్.. దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన తల్లి!

బాలిక మృతి..

పవన్ అతని స్నేహితుడు అమన్ వేధింపులు తట్టకోలేక తీవ్ర మనస్తాపానికి గురైన బాలిక ఈ నెల 8న ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఖమ్మంలో ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం వరంగల్‌కు బాలికను తరలించారు. దీంతో చికిత్స పొందుతూ నేడు ఉదయం బాలిక మృతి చెందింది. బాలిక తల్లి ఫిర్యాదుతో ఖమ్మం అర్బన్ పోలీసులు మైనర్ యువకులపై కేసు నమోదు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. బాలిక మృతితో కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు పరారీలో ఉన్న అమన్ కోసం ముమ్మర దర్యాప్తు చేపట్టారు. వరంగల్ నుండీ ఖమ్మంకు బాలిక మృతదేహం తరలించారు.

Advertisement

Also read: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు‌లో తగ్గిన ప్రయాణికుల తాకిడి.. ఏకంగా 11 శాతం డౌన్, అవే కారణాలు

Tags

Related News

మహిళలకు గుడ్‌న్యూస్.. ఇందిరమ్మ కుట్టు మిషన్ దరఖాస్తు గడువు పొడిగింపు!

ట్రేడ్ లైసెన్స్ పేరుతో దోపిడీ.. పట్టుకుని పోలీసులకు అప్పగించిన యువకులు!

వీడెవడండి బాబు.. ఏకంగా పెళ్ళాం ముక్కు కొరికేశాడు, మంచిర్యాలలో దారుణం

ట్రాఫిక్‌కు చెక్.. హైదరాబాద్ సిటీ చుట్టూ నాలుగు బస్సు టెర్మినల్స్, ఎక్కడెక్కడంటే

కర్ణాటక నుంచి నైరుతి బంగాళాఖాతం వరకు.. రానున్న మూడు రోజులు తెలంగాణలో భారీ వర్షాలు

వినాయక నిమజ్జనానికి డీజే పెడుతున్నారా.. అయితే మీకో షాకింగ్ న్యూస్!

కేసీఆర్ చిటికె వేస్తే కాంగ్రెస్ నాయకులు ఊళ్లలో తిరగలేరు: జీవన్ రెడ్డి

Big Stories

Advertisement
×