BigTV English

Revanth Reddy: రేవంత్‌రెడ్డికి గన్‌మెన్లు తొలగింపు.. టార్గెట్ చేసిన సర్కారు!?

Revanth Reddy: రేవంత్‌రెడ్డికి గన్‌మెన్లు తొలగింపు.. టార్గెట్ చేసిన సర్కారు!?
revanth reddy

Revanth Reddy: తెలంగాణలో మోస్ట్ డైనమిక్ లీడర్ అంటే రేవంత్‌రెడ్డినే. బలమైన కాంగ్రెస్‌ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు కూడా. సీఎం కేసీఆర్‌పై అందరికంటే ఎక్కువగా, బలంగా పోరాడుతున్నది కూడా ఆయనే. పీసీసీ చీఫ్‌గా ప్రజాపోరాటాలు చేస్తున్నారు. ఎంపీగా నిత్యం ప్రజల్లో ఉంటున్నారు. ఇలాంటి రేవంత్‌రెడ్డికి ఎంత పటిష్ట భద్రత కల్పించాలి? కానీ, ప్రభుత్వం ఏం చేస్తోంది? ఉన్న సెక్యూరిటీనే తీసేసింది. రేవంత్‌పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. సీఎం కేసీఆర్ తీరుపై కాంగ్రెస్ భగ్గుమంటోంది.


గత ఎన్నికల ప్రచార సమయంలో రేవంత్‌రెడ్డికి సీఆర్పీఎఫ్ సెక్యూరిటీ కల్పించాలని హైకోర్టు ఆదేశించింది. కోర్లు ఆదేశాలతో కొన్నాళ్లు టైట్ సెక్యూరిటీ ఇచ్చి.. ఆ తర్వాత తీసేశారు. ఎంపీగా గెలిచినా.. 4+4 గన్‌మెన్లను మాత్రమే ఇచ్చారు. రేవంత్ పీసీసీ చీఫ్ అయ్యాకనైనా.. భద్రత పెంచాల్సింది పోయి.. మరింత తగ్గించారు. 4+4 ను 2+2 సెక్యూరిటీకి తగ్గించింది సర్కారు. ఎందుకు తగ్గించారంటే.. పోలీసుల దగ్గర కారణం లేదు.

తనకు అదనపు సెక్యూరిటీ కల్పించాలంటూ రేవంత్‌రెడ్డి ఇటీవల కోర్టుకు కూడా వెళ్లారు. అయినా, సెక్యూరిటీ పెంచలేదు. తాజాగా ఉన్న ఇద్దరు గన్‌మెన్లను కూడా తొలగించడం వివాదాస్పదమవుతోంది. దీంతో బుధవారం నుంచి సెక్యూరిటీ లేకుండా తిరుగుతున్నారు రేవంత్‌రెడ్డి.


పోలీసులను ఉద్దేశించి పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి కొద్దిరోజుల క్రితం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. దానిపై పోలీస్ అధికారుల సంఘం ఫిర్యాదు కూడా చేసింది. ఆ కామెంట్లకు నిరసనగా.. తాము రేవంత్ దగ్గర పనిచేయలేమంటూ గన్‌మెన్లు వెనక్కి వెళ్లిపోయారని తెలుస్తోంది. గన్‌మెన్లు లేకపోవడంతో.. రెండు రోజులుగా రేవంత్‌రెడ్డి విత్ అవుట్ సెక్యూరిటీ ప్రజల్లోకి వెళ్తున్నారు.

అయితే, గన్‌మెన్లు సొంతంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకొని ఉండకపోవచ్చని.. పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకే వారిలా రేవంత్‌రెడ్డికి హ్యాండ్ ఇచ్చారని అంటున్నారు. దీని వెనుక రాజకీయ కోణం ఉందని.. రేవంత్‌ను టార్గెట్ చేసేలా కేసీఆర్ సర్కారు వ్యవహరిస్తోందని కాంగ్రెస్ వర్గాలు మండిపడుతున్నాయి. ప్రజానాయకుడైన రేవంత్‌రెడ్డికి ఏమైనా హామీ జరిగితే అందుకు సీఎం కేసీఆరే బాధ్యత వహించాలని హెచ్చరిస్తున్నాయి. ఇక, సెక్యూరిటీ మేటర్ కోర్టులోనే తేల్చుకుంటామని సవాల్ కూడా చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. తమ నాయకుడికి ప్రజలే సెక్యూరిటీ ఇస్తారని అంటున్నారు.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×