E-Paper
Advertisement

TSRTC News : ఆర్టీసీ విలీనం.. ఇంకా ఉంది.. గవర్నర్ దగ్గరే పెండింగ్!

TSRTC News : ఆర్టీసీ విలీనం.. ఇంకా ఉంది.. గవర్నర్ దగ్గరే పెండింగ్!
Advertisement
TSRTC News

TSRTC News : తెలంగాణలో ఆర్టీసీ బస్సు బిల్లు ఇంకా పెండింగ్‌లోనే ఉంది. ఇటీవల బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పటికీ ముందుకు కదలడంలేదు. బిల్లు ఆమోదానికి రాజ్‌భవన్‌ ఓకే చెప్పినప్పటికీ.. పాస్ అయిన బిల్లుపై గవర్నర్ ఇంకా సంతకం చేయకపోవడం మరోసారి రాజకీయ రచ్చకు కారణమైంది.

Advertisement

ధర్నాలు, చర్చల తర్వాత.. అసెంబ్లీలో ఆర్టీసీ బిల్లు ప్రవేశపెట్టడానికి గవర్నర్‌ తమిళిసై గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. వెంటనే అసెంబ్లీలో బిల్లు పెట్టి పాస్‌ చేసేసింది సర్కారు. అంతమాత్రానికే ఆర్టీసీ.. ప్రభుత్వంలో విలీనం అయినట్టు కాదు. ఇంకా ప్రాసెస్ ఉంది. పాస్ అయిన బిల్లుపైనా గవర్నర్‌ సంతకం చేయాల్సి ఉంటుంది. అయితే, తమిళిసై ఇంకా ఆ బిల్లును ఆమోదించలేదు.

ఆర్టీసీలో కేంద్ర ప్రభుత్వ వాటా ఉండటంతో.. బిల్లును రాష్ట్రపతి ఆమోదానికి గవర్నర్ పంపుతారని ప్రచారం జరిగింది. ఈ వార్తలను రాజ్‌భవన్ వర్గాలు ఖండించాయి. ఆర్టీసీ బిల్లును న్యాయ సలహా కోసం న్యాయశాఖకు పంపినట్టు తెలిపాయి. గవర్నర్ సూచించిన సవరణలు, సూచనలు బిల్లులో పొందుపరిచారా? లేదా? అనే విషయం తెలుసుకునేందుకే న్యాయశాఖకు పంపినట్టు చెబుతున్నారు.

Advertisement

ఇక, రాజ్‌భవన్‌లో బిల్లు ఆలస్యం అవుతుండటంతో.. ఆర్టీసీ యూనియన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మరోసారి ధర్నాలకు సమాయత్తమవుతున్నాయి.

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×