E-Paper
Advertisement

Revanth Reddy : ఉద్యోగులకు ఒకటో తేదినే జీతాలు.. రేవంత్ హామీ..

Revanth Reddy : ఉద్యోగులకు ఒకటో తేదినే జీతాలు.. రేవంత్ హామీ..
Advertisement

Revanth Reddy : రామగుండంలో కాంగ్రెస్‌ విజయభేరి బహిరంగ సభకు జనం పోటెత్తారు. ఈ సభలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. భారీగా మహిళలు తరలివచ్చారు. పెద్ద సంఖ్యలో మహిళలను చూస్తుంటే కాంగ్రెస్‌ విజయం సాధించినట్లే అనిపిస్తోందన్నారు. ఈ సభలో సింగరేణి కార్మికుల సమస్యలను రేవంత్ ప్రస్తావించారు.

తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికులు పాల్గొన్నారని రేవంత్ గుర్తు చేశారు. బొగ్గు ఉత్పత్తి ‌బంద్ చేసి‌ మద్దతు తెలిపారని వివరించారు. వారి సమస్యలు తీరుస్తానని నాడు కేసీఆర్‌ హామీ ఇచ్చారన్నారు. సింగరేణి కార్మికుల సొంత ఇంటి కల నెరవేరిందా? అని ప్రశ్నించారు. సింగరేణి ఎన్నికలు జరుగకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు. కార్మికులతో పెట్టుకుంటే గద్దెలు కూలుతాయని‌ హెచ్చరించారు.

Advertisement

ఓపెన్ కాస్ట్ మైన్లను AMR కంపెనీలకు అప్పజెప్పారని రేవంత్ విమర్శించారు. రామగుండంలో విద్యుత్ ‌ప్రాజెక్టులు‌ మూతపడ్డాయని తెలిపారు. సింగరేణి ‌కష్టాలు పోవాలంటే కాంగ్రెస్ పార్టీకి‌ పట్టం‌ కట్టాలని పిలుపునిచ్చారు.ఇక్కడి ఎమ్మెల్యే ‌సానుభూతితో గెలిపిస్తే ఉద్యోగాలు అమ్ముకున్నాడని ఆరోపించారు. ఎమ్మెల్యే ‌బందిపోటులామారి వనరులు దోస్తున్నారని ఆరోపించారు. రామగుండం ‌ఎమ్మెల్యే‌ కేసీఆర్ ‌కుటుంబానికి కప్పం కడుతున్నారని ఆరోపించారు.

రేషన్ షాపుల్లో సన్నబియ్యం ఇవ్వాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ ‌ఉద్యోగులకు ఒకటో తేదినే తేదిన జీతాలు‌ ఇస్తామని ప్రకటించారు. రామగుండంలో ప్రజల ఆశీర్వాదంతో కాంగ్రెస్ విజయం సాధిస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తంచేశారు. చీకటిలో‌ మగ్గుతున్న రామగుండంలో వెలుగులు విరజిమ్మేలా చేస్తామని హామీఇచ్చారు.

Advertisement

.

.

.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×