BigTV English

Robot Kills Man : మనిషిని చంపిన రోబో.. ఎందుకు చేసిందంటే..

Robot Kills Man : టెక్నాలజీ రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో మనిషి రోబోలను ప్రతి పనికోసం వినియోగిస్తున్నాడు. కానీ కొన్ని సందర్భల్లో ఈ రోబోల వల్ల భారీ తప్పిదాలే జరుగుతున్నాయి. ఎందుకంటే ఇటీవల దక్షిణ కొరియా దేశంలో ఓ మనిషిని రోబో చంపేసింది.

Robot Kills Man : మనిషిని చంపిన రోబో.. ఎందుకు చేసిందంటే..

Robot Kills Man : టెక్నాలజీ రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో మనిషి రోబోలను ప్రతి పనికోసం వినియోగిస్తున్నాడు. కానీ కొన్ని సందర్భల్లో ఈ రోబోల వల్ల భారీ తప్పిదాలే జరుగుతున్నాయి. ఎందుకంటే ఇటీవల దక్షిణ కొరియా దేశంలో ఓ మనిషిని రోబో చంపేసింది.


దక్షిణ కొరియా మీడియా తెలిపిన వివరాల ప్రకారం.. కూరగాయల ప్యాకింగ్ బాక్సుని ఎత్తి మరో చోట పెట్టే ఒక రోబో యంత్రం ఆ పక్కనే ఉన్న మనిషిని పొరపాటున కూరగాయల బాక్సుగా భావించి ఎత్తి దూరంగా విసిరేసింది. దీంతో ఆ మనిషికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆ వ్యక్తి మరణించాడు.

చనిపోయిన వ్యక్తి ఆ రోబో తయారు చేసిన సంస్థలో పనిచేసే పనిశీలకుడు. ఆ రోబో సెన్సార్లను సరిచేసే సమయంలో ఈ ప్రమాదం జరిగిందని సమాచారం. ఇలాంటి ప్రమాదాలు తరుచూ జరుగుతూనే ఉన్నాయి.


ఈ ఏడాది మే నెలలో దక్షిణ కొరియాలోని ఆటోమొబైల్ కంపెనీలో రోబో చేతిలో చిక్కుకుని ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అలాగే 2015 సంవత్సరంలో జర్మనీ దేశంలో ప్రముఖ కార్ల తయారీ కంపెనీ వోక్స్ వ్యాగన్ ఫ్యాక్టరీలో ఓ కార్మికుడు ప్రమాదవశాత్తు రోబో చేతిలో చనిపోయాడు.
1992 నుంచి 2017 సంవత్సరం వరకు ఇలాంటి ప్రమాదాలలో కేవలం అమెరికాలోనే 41 మంది మరణించారు.

Related News

Putin Kim Jinping: ఒకే వేదికపై పుతిన్, కిమ్, జిన్ పింగ్.. చైనాలో ఈ ముగ్గురు ఏం చేయబోతున్నారంటే?

H1B New Rules: గ్రీన్ కార్డ్స్, వీసాలపై ట్రంప్ బాంబ్.. ఇండియన్స్ పై ఎలాంటి ప్రభావం పడుతుందంటే?

Nuke India: ‘ట్రంపును చంపాలి.. ఇండియాపై అణు బాంబు వెయ్యాలి.. అమెరికా షూటర్ గన్ పై సంచలన నినాదాలు

Kartarpur Corridor: పొంగిన రావి నది.. మునిగిన కర్తార్‌పూర్ కారిడార్.. నీటిలో వందలాది మంది

Minneapolis shooting: మినియాపొలిస్‌లో రక్తపాతం.. చర్చి స్కూల్‌పై రైఫిల్ దాడి.. అసలేం జరిగిందంటే?

Trump Statement: భారత్, పాక్ కి నేనే వార్నింగ్ ఇచ్చా.. మరింత గట్టిగా ట్రంప్ సెల్ఫ్ డబ్బా

Big Stories

×