E-Paper
Advertisement

నాడు ఎన్నికల్లో.. నేడు పరిపాలనలో.. రేవంత్ మైండ్ గేమ్‌లో ఇరుక్కున్న బీఆర్ఎస్!

నాడు ఎన్నికల్లో.. నేడు పరిపాలనలో.. రేవంత్ మైండ్ గేమ్‌లో ఇరుక్కున్న బీఆర్ఎస్!
Advertisement

Revanth Strategy: తెలంగాణ రాజకీయాల్లో సీఎం రేవంత్ రెడ్డి తన దైన శైలీలో దూసుకుపోతున్నారు. పొలిటికల్ ప్లాట్ ఫామ్ లలో అజెండాను సెట్ చేయడం, రాజకీయ ప్రత్యర్ధులను తమ సొంత వ్యూహాల్లోనే బంధించడం వంటి అంశాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సక్సెస్ పుల్ గా సాగుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల నుంచి మొదలైన ఆయన ‘స్ట్రాటజీ ట్రాప్’.. ఇప్పటి అసెంబ్లీ సమావేశాల వరకు కొనసాగుతూనే ఉంది. అప్పటి ఎన్నికల రేసులో అభ్యర్థుల ఎంపిక నుంచి, ప్రస్తుత ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ను డిఫెన్స్‌లో పడేయడం వరకు సీఎం రేవంత్ రెడ్డి సంపూర్ణంగా ‘అప్పర్ హ్యాండ్’ సాధించారనే వాదన రాజకీయ విశ్లేషకుల్లో బలంగా వినిపిస్తోంది.

పొలిటికల్ మాస్టర్‌స్ట్రోక్‌

2023అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ల కేటాయింపు ప్రక్రియే ఒక పెద్ద పొలిటికల్ మాస్టర్‌స్ట్రోక్‌గా మారింది. ఇదే క్రమంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో రూపుదిద్దుకున్న అభ్యర్థుల ఎంపిక వ్యూహం, అప్పటి అధికార బీఆర్ఎస్ పార్టీ అంచనాలను పూర్తిగా తలకిందులు చేసింది. అంతేగాక బీఆర్ఎస్ లో నెలకొన్న నెగిటివ్ ను కూడా బయటకు వెళ్లకుండా పీసీసీ చీఫ్​ హోదాలో రేవంత్ రెడ్డి తన వ్యూహాలతో బంధించారనే చర్చ కూడా ఉంది. దీంతో 2023 సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ ఎస్ ప్రతిపక్ష పాత్రకు పరిమితం కావాల్సి వచ్చింది.

వన్ ఇయర్ నుంచి ట్రాప్?

Advertisement

పీసీసీ చీఫ్​ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి కొన్ని అస్త్రాలను ఉపయోగించి బీఆర్ఎస్ ను తన ట్రాప్ లో పడేశారనే చర్చ గతంలో విస్తృతంగా జరిగింది. 2023 అసెంబ్లీ ఎన్నికలకు వన్ ఇయర్ ముందు నుంచే ఆయన మొదలు పెట్టిన ఆట, స్ట్రాటజీలో కేసీఆర్ లాంటి సీనియర్ రాజకీయ వేత్తలు కూడా పడాల్సి వచ్చింది. ప్రధానంగా టిక్కెట్ల పంపిణీ విషయంలో బీఆర్ ఎస్ స్పష్​టంగా ఇరుక్కుంది. పదేళ్ల ప్రభుత్వం, పరిపాలనపై నమ్మకం ఉంటే సిట్టింగ్ లకే సీట్లు ఇవ్వాలని పీసీసీ చీఫ్​ హొదాలో సీఎం రేవంత్ రెడ్డి అప్పటి సీఎం కేసీఆర్ పదే పదే ఛాలెంజ్ చేశారు. లేకుంటే కేసీఆర్ పాలనపై ఆయనకే నమ్మకం లేనట్టేనని పీసీసీ చీఫ్​ గా రేవంత్ తన పొలిటికల్ స్ట్రాటజీ ఉపయోగించారు.

సిట్టింగ్ ఎమ్మెల్యేల ట్రాప్

దీంతో మెజార్టీ సీట్లను బీఆర్ఎస్ సిట్టింగ్ లకే ఇచ్చి, స్వల్ప సీట్ల తేడాతో ఓటమీ పాలైంది. వాస్తవానికి బీఆర్ ఎస్ పదేళ్ల పాలన తర్వాత చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలపై అవినీతి, అరాచకాలు వంటి ఆరోపణలు వెల్లువెత్తాయి. జనాల్లో ఇది బలంగా నాటుకుపోయింది. దీన్ని గుర్తించిన రేవంత్ దమ్ముంటే సిట్టింగ్ లకే సీట్లు ఇవ్వాలని కేసీఆర్ కు సవాల్ విసిరి సక్సెస్ అయ్యారు. మరోవైపు కేసీఆర్ సుమారు 11 స్థానాల్లో అభ్యర్ధులను మార్చగా 9 చోట్ల గెలిచారు. అంటే 2023 లో సిట్టింగ్ స్థానాలను మార్చి ఉంటే బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి మరోలా ఉండేదని ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు.

దళిత బంధు విషయంలో..

Advertisement

మరోవైపు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దళితబంధు పథకాన్ని ఆ పార్టీకి వ్యతిరేకంగా వాడుకోవడంలో రేవంత్ సక్సెస్ అయ్యారనే చెప్పాలి. నిజానికి దళిత బంధు స్కీమ్ లో పైలట్ దశలోనే కొన్ని సమస్యలను అధికారులు గుర్తించారు. ఈ పథకం అమలు చేస్తే లాభం కంటే నష్టమే ఎక్కువని కేసీఆర్ కు సూచించారు. కానీ స్కీమ్ ప్రకటన తర్వాత వెనక్కి తగ్గితే బాగోదని దళిత బంధు విషయంలో గుడ్డిగా అప్పటి సర్కార్ ముందుకెళ్లింది. ఈ స్కీమ్ లో లబ్ది పొందని వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారారు. దీనికి తోడు లబ్దిదారుల ఎంపికలో ఎమ్మెల్యేలు కమిషన్లు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ అంశాన్ని ఎన్నికల ప్రచారంలో రాజకీయ అస్త్రాంగా మార్చుకొని రేవంత్ విజయం సాధించారు.

తాజాగా అసెంబ్లీలో సైతం..

తాజాగా అసెంబ్లీలో వెయ్యి రోజుల పాలనపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తాయని ముందే ఊహించిన సీఎం రేవంత్.. తన స్ట్రాటజీని అమలు చేశారు. దీనిలో భాగంగానే ప్రతిపక్షాలను పరోక్షంగా రెచ్చకొట్టారు. నల్లబ్యాడ్జీలు, టీ షార్ట్ ల అంశంలో సభకు రానీయ్యకుండా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. కానీ అక్కడ బీఆర్ ఎస్ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేయడంతో పెద్ద రాద్దంతమే జరిగింది. పోలీసులు, మర్షల్స్, బీఆర్ ఎస్ సభ్యుల మధ్య పెద్ద యుద్ధ వాతావరణం ఏర్పడింది. దీంతో సహనం కోల్పోయిన బీఆర్ఎస్ సభ్యులు ఏకంగా స్పీకర్ పైనే పలుష పదజాలంతో విమర్శలు చేశారు. దీంతో దీనిని అసెంబ్లీలో ప్రధాన అస్త్రంగా కాంగ్రెస్ మలుచుకుంది.

దళితుల వివాదంలో బీఆర్ఎస్..

అంతేగాక బీఆర్ఎస్ విమర్శల దాడికి నిరసనగా కేసీఆర్ ఫామ్ హౌజ్ ముందు డప్పు కొట్టడం అనే స్ట్రాటజీని రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ శ్రేణులు అమలు చేశారు. అయితే ఆ తర్వాత రోజు కొందరు గులాబీ నేతలు పసుపు నీళ్లతో కడగటం వలన బీఆర్ ఎస్ మళ్లీ ఇరుక్కున్నది. కులాల అంశంలో దారుణంగా విమర్శల పాలవుతోంది. అంతేగాక బీఆర్ఎస్ సభ్యులు సస్పెన్షన్ కావడంతో ప్రభుత్వం అసెంబ్లీని సజావుగా నిర్వహించుకోగల్గుతోంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే బీజేపీ సభ్యులు ప్లకార్డులు పట్టుకొని నిండు సభలోకి వచ్చినా ఎక్కడా అడ్డుకోలేదు. దీన్ని గమనిస్తే సీఎం రేవంత్ ఆడిన మైండ్ గేమ్, ట్రాప్ లో బీఆర్ఎస్ పడిందనేది స్పష్​టంగా అర్థమవుతున్నది.

టిక్కెట్ల ఎంపికలోనూ రేవంత్ స్పష్టత

2023 అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించిన తర్వాత వారి బలహీనతలు, స్థానికంగా ఉన్న వ్యతిరేకతను పక్కాగా అంచనా వేసి కాంగ్రెస్ తమ పావులను కదిపింది. బీఆర్ఎస్ ముఖ్య నేతలను, అసంతృప్తిగా ఉన్న సీనియర్లను కాంగ్రెస్ సమర్థవంతంగా తమవైపు తిప్పుకున్నది. అంతేగాక బీఆర్ఎస్ పదేళ్ల పాలనలోని వైఫల్యాలను, హామీల అమలును ప్రధాన చర్చనీయాంశంగా మార్చి, బీఆర్ఎస్ పాలనపై జనాల్లో చర్చ జరిగేలా చేశారు. అటు కాళేశ్వరం నిర్మాణం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఫోన్ ట్యాపింగ్, విద్యుత్ కొనుగోళ్లు వంటి తీవ్రమైన అంశాలపై బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా రేవంత్ గతంలోనే తన స్ట్రాటజీని అమలుచేసి ప్రజల మెదళ్లలో మెదిలేలా చేశారు.

Also Read: జిన్ పింగ్ రాకకు ముందు.. చైనా రాయబారి ఆసక్తికర పోస్ట్.. ఏమన్నారంటే?

రేవంత్ అప్పర్ హ్యాండ్!

మెుత్తంగా ఎన్నికల ముందు అభ్యర్థుల ఎంపిక, ప్రచారంలో చూపిన దూకుడు.. నేడు పరిపాలనలో, అసెంబ్లీ వేదికగా వ్యూహాలు అమలు చేయడంలోనూ రేవంత్ కొనసాగిస్తున్నారు. ఎంతో రాజకీయ అనుభవం ఉన్న కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీ.. రేవంత్ రెడ్డి వేసే పొలిటికల్ ట్రాప్‌లలో ఎప్పటికప్పుడు చిక్కుకొని సమస్యలు కొనితెచ్చుకుంటోంది. అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి సాధిస్తున్న ఈ ‘అప్పర్ హ్యాండ్’ రాబోయే ఎన్నికలు, భవిష్యత్ రాజకీయాల్లోనూ కాంగ్రెస్‌కు ఎంతవరకు ఉపయోగపడుతుందో వేచి చూడాలి. కానీ ప్రస్తుతానికి మాత్రం తెలంగాణ రాజకీయ చదరంగంలో రేవంత్ వేసే ఎత్తులకు ప్రతిపక్షం కుదేలైందనే చర్చ మాత్రం పొలిటికల్ ప్లాట్ ఫామ్స్, సోషల్ మీడియాలో విస్తృతమైంది.

Also Read: ముందు నుయ్యి.. వెనుక గొయ్యి.. దిక్కుతోచని స్థితిలో గులాబీ ఎమ్మెల్యేలు!

Tags

Related News

ముందు నుయ్యి.. వెనుక గొయ్యి.. దిక్కుతోచని స్థితిలో గులాబీ ఎమ్మెల్యేలు!

ట్రంప్ మాస్టర్ స్ట్రోక్.. భారతీయులకు బిగ్ షాక్!

సభా సమరంలో ఓడినా.. ఇలా సబ్జెక్టుతో కొడతాం! కరెంటు కష్టాలపై సర్కార్‌ను నిలదీసిన బీఆరెస్‌!

సైలెంట్‌గా ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. కేసీఆర్ సీరియస్.. కాంగ్రెస్‌కు జై కొడతారా?

తెలంగాణ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. మళ్లీ దళిత్ వర్సెస్ దొరలు.. కాంగ్రెస్ ప్లాన్ వర్కౌట్ అయ్యేనా!

అసెంబ్లీలో BRS వ్యూహం రివర్స్.. ప్రభుత్వం చేతికి చిక్కిన ప్రతిపక్షం!

నిజం చెప్పిన జర్నలిజంపై నిషేధమా? ఈ 4 ప్రశ్నలకు సమాధానం చెబుతారా? DSC స్కామ్‌పై జగన్ అస్త్రాలు!

Big Stories

Advertisement
×