Trolls On Bharti Fulmali: ఉమెన్స్ ఆసియా కప్ 2026 టోర్నమెంట్ (Women’s Asia Cup 2026 Tournament) ఫైనల్ దశకు వచ్చేసింది. ఆదివారం రోజున టీమిండియా ఉమెన్స్ వర్సెస్ శ్రీలంక ఉమెన్స్ జట్ల (India Women vs Sri Lanka Women, Final) మధ్య దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం (Dubai International Cricket Stadium, Dubai) వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది. నిన్న పాకిస్తాన్ జట్టును చిత్తు చేసి మరి, ఫైనల్స్ లోకి దూసుకు వచ్చింది శ్రీలంక. అయితే మొన్న గ్రూప్ స్టేజిలో టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ (Team India vs. Pakistan) మధ్య మ్యాచ్ జరిగినప్పుడు భారతి ఫుల్మాలిని ( Bharti Fulmali) ఉద్దేశించి పాకిస్తాన్ తో పాటు బంగ్లాదేశ్ అభిమానులు రెచ్చిపోయారు. భారతి ఫుల్మాలి అమ్మాయి కాదు… మగాడే అంటూ రెచ్చిపోయి ప్రవర్తించారు. బౌండరీ గేటు దగ్గర నిలబడ్డ భారతిని ఉద్దేశించి.. దారుణంగా ప్రవర్తించారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
టీమిండియా మహిళా క్రికెట్ లో స్థానం దక్కించుకున్న భారతి ఫుల్మాలి… మంచి ఆల్రౌండర్. కుడి చేతి వాటం బ్యాటింగ్ తో పాటు రైట్ ఆర్మ్ మీడియం ఫాస్ట్ బౌలింగ్ చేయగలుగుతుంది. దేశవాళి క్రికెట్ లో వేగంగా బ్యాటింగ్ చేసి.. మహేంద్ర సింగ్ ధోనీ లాగా ఫినిషర్ గా పేరు తెచ్చుకుంది. మహారాష్ట్రలోని అమరావతిలో 1994 అక్టోబర్ 11వ తేదీన జన్మించింది భారతి ఫుల్మాలి. విదర్భ మహిళల క్రికెట్ జట్టు ద్వారా తన ప్రయాణాన్ని ప్రారంభించి.. ఆ తర్వాత దేశ వాలి క్రికెట్ లో భారీ సిక్సర్లు బాదింది. ఈ క్రమంలోనే లేడీ క్రిస్ గేల్ గా పేరు కూడా తెచ్చుకుంది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్లో గుజరాత్ జట్టు తరఫున ప్రతిభ కనబరిచి… టీమిండియా టి20 జట్టులోకి వచ్చేసింది. మొన్నటి టి20 మహిళల ప్రపంచక సందర్భంగా టీమిండియాలో అడుగుపెట్టిన భారతి ఫుల్మాలి, మహిళల ఆసియా కప్ స్క్వాడ్ లో కూడా స్థానం సంపాదించుకుంది.
టీమిడియా మహిళా క్రికెటర్ భారతి ఫుల్మాలి శరీర ఆకృతి మగాడిలా ఉంటుంది. సరిగ్గా పరిశీలిస్తే గాని ఆమె మహిళా క్రికెటర్ గా గుర్తించలేము. ఆమె గురించి తెలియని వాళ్ళందరూ అబ్బాయి అనుకుంటారు. అందుకే నిత్యం భారతిపై సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తూ ఉంటారు. అయితే లేటెస్ట్ గా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ గ్రూప్ స్టేజ్ మ్యాచ్ జరిగిన సందర్భంగా బౌండరీ గేటు దగ్గర భారతి ఫుల్మాలి ఫీల్డింగ్ చేసింది. ఈ క్రమంలో బౌండరీ గేటు దగ్గర ఉన్న పాకిస్తాన్ అలాగే బంగ్లాదేశ్ అభిమానులు రెచ్చిపోయి ప్రవర్తించారు. భారతి అమ్మాయి కాదు.. అబ్బాయి అంటూ ఆడవడం మొదలుపెట్టారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Pakistani and Bangladeshi fans have crossed all limits now 🚨
After the India vs Pakistan match, when Indian women’s cricketer Bharti Fulmani went to give selfies and autographs to Indian fans, some Pakistani and Bangladeshi fans started abusing her.
They started questioning… pic.twitter.com/hHnRx8pqX8
— TEJASH 🚩 (@Tejashyy) September 12, 2026