Modi Jinping Meeting: న్యూఢిల్లీలో నేటి నుంచి రెండ్రోజుల పాటు జరిగే బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు భారత్ – చైనా దౌత్య సంబంధాల బలోపేతానికి వేదికగా మారే సంకేతాలు కనిపిస్తున్నాయి. బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఇవాళ భారత్ కు రానున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీతో ఆయన ప్రత్యేకంగా సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఈ నేపథ్యంలో భారత్ లోని చైనా రాయబారి ఎక్స్ లో పెట్టిన పోస్ట్ ఆసక్తికరంగా మారింది. మోదీ, జిన్ పింగ్ భేటి ద్వారా ఇరు దేశాల మధ్య ఉన్న విభేదాలు పరిష్కరమవుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. భారత్ తో సత్సంబంధాలను కొనసాగించేందుకు చైనా సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
శుక్రవారం రాత్రి ఎక్స్ (ట్విట్టర్) వేదికగా చైనా రాయబారి గ్జూ ఫీహాంగ్ (Xu Feihong) స్పందిస్తూ ఇరు దేశాల అగ్రనేతల భేటీకి సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయని పేర్కొన్నారు. కజాన్, తియాంజిన్‌లలో జరిగిన భేటీల తర్వాత.. మోదీ, జిన్ పింగ్ వరుసగా మూడో ఏడాది కూడా కలవడం శుభపరిణామమని ఆయన పేర్కొన్నారు. భారత్ – చైనా దైపాక్షిక సంబంధాలను దీర్ఘకాలిక దృష్టితో వ్యూహాత్మకంగా ముందుకు తీసుకెళ్లేందుకు ఈ సమావేశం దోహదపడుతుందని ఆయన అంచనా వేశారు.
China and India are arranging for the bilateral meeting between President Xi and Prime Minister Modi.
This will be the third year in a row for the two leaders to meet with each other, following their meetings in Kazan and Tianjin.
China will work with India to act on the… pic.twitter.com/jD3GeZpjZk
— Xu Feihong (@China_Amb_India) September 11, 2026
2020లో గాల్వాన్ లోయలో జరిగిన సరిహద్దు ఘర్షణల తర్వాత భారత్, చైనాల మధ్య దౌత్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆ ఘటన తర్వాత జిన్‌పింగ్ భారత్‌కు రానుండటం ఇదే తొలిసారి. సరిహద్దుల్లో శాంతిని పునరుద్ధరించడం, దౌత్యసంబంధాలను మెరుగుపరచడం, పరస్పర సహకారాన్ని విస్తరించడం ద్వారా విభేదాలను పరిష్కరించుకోవాలని ఇరు దేశాలు భావిస్తున్నాయి. ఒకరికొకరు సహాయపడే మంచి పొరుగువారిగా, భాగస్వాములుగా భారత్ తో ఉండటమే తమ లక్ష్యమని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి మావో నింగ్ కూడా ఇటీవల పేర్కొన్నారు.
Also Read: తెలంగాణ అసెంబ్లీలో నేడు క్యూర్ బిల్లుపై చర్చ? రాబోయే కీలక మార్పులు ఇవే!
కాగా, చైనా వార్తా సంస్థ జిన్హువా తెలిపిన వివరాల ప్రకారం.. జిన్‌పింగ్ శనివారం మధ్యాహ్నం న్యూఢిల్లీకి చేరుకోనున్నారు. ఆయన వెంట చైనా కమ్యూనిస్ట్ పార్టీ అగ్రనేత సాయ్ కీ, విదేశాంగ మంత్రి వాంగ్ యీ సహా పలువురు ఉన్నతాధికారుల భారత్ కు రానున్నారు. ఇవాళ సా. 5:45 గంటలకు ప్రధాని మోదీ, జిన్‌పింగ్‌ల ద్వైపాక్షిక భేటి జరగనుంది. మరోవైపు ఇవాళ, రేపు జరిగే బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు ఇప్పటికే రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ భారత్ లో అడుగుపెట్టారు. శుక్రవారం మోదీ – పుతిన్ మధ్య ద్వైపాక్షిక భేటి జరగడం గమనార్హం.
Also Read: ముందు నుయ్యి.. వెనుక గొయ్యి.. దిక్కుతోచని స్థితిలో గులాబీ ఎమ్మెల్యేలు!