E-Paper
Advertisement

Telangana Advisors: తెలంగాణ ప్రభుత్వ సలహాదారుల నియామకం రద్దు.. ఏడుగురిపై వేటు

Telangana Advisors: తెలంగాణ ప్రభుత్వ సలహాదారుల నియామకం రద్దు.. ఏడుగురిపై వేటు
Advertisement

Telangana Advisors: తెలంగాణలో ప్రభుత్వ సలహాదారుల నియామకాలను ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఏడుగురిని తొలగిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. పదవులు కోల్పోయిన వారిలో.. మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ , మాజీ సీఎస్‌లు సోమేష్ కుమార్, రాజీవ్‌శర్మ, మాజీ డీజీపీ అనురాగ్ శర్మ, మాజీ సీపీ ఏకే ఖాన్, శోభ, జి.ఆర్.రెడ్డి ఉన్నారు.

వీరిలో వ్యవసాయ శాఖకు చీఫ్ ఎడ్వైజర్‌గా చెన్నమనేని రమేష్ పనిచేస్తున్నారు. వేములవాడ ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయనకు.. మొన్నటి ఎన్నికల్లో కేసీఆర్ టికెట్ ఇవ్వలేదు. ఆయన ప్లేస్‌లో మరొకరిని ఎన్నికల బరిలో నిలిపి.. చెన్నమనేని రమేష్‌కు వ్యవసాయ శాఖ ముఖ్య సలహాదారుగా నియమించారు. ఐదేళ్ల పదవీకాలం ఉంటుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఆయన పదవికి శుభం కార్డు పడింది.

Advertisement

మిగతావారి విషయానికి వస్తే.. సోమేష్‌కుమార్, రాజీవ్‌శర్మ ఇద్దరూ.. ప్రభుత్వ మాజీ ప్రధానకార్యదర్శులు. సీఎస్‌లుగా వారి పదవీకాలం పూర్తికాగానే నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ సలహాదారుల పోస్టులిచ్చారు. ఇక, అనురాగ్‌శర్మ మాజీ డీజీపీ కాగా.. ఏకేఖాన్ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి. శోభ రిటైర్డ్ IFS, ఆర్థికశాఖ సలహాదారుగాజిఆర్ రెడ్డి పనిచేస్తున్నారు.

Related News

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

మేడ్చల్‌లో పార్కింగ్ రగడ కలకలం.. హెచ్చరికలు జారీ చేసిన సీఐ క్రాంతి కుమార్!

తెలంగాణలో కొత్త పింఛన్‌‌దారులకు బిగ్ రిలీఫ్.. ఆ విషయంపై క్లారిటీ!

కాంగ్రెస్‌కు కొండా‌ గుడ్‌బై? త్వరలో భారీ అప్‌డేట్ అంటూ పోస్ట్, వాస్తవం ఏమిటంటే?

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

Big Stories

Advertisement
×