BigTV English

Telangana Bhavan: బీఆర్ఎస్ కు షాక్.. తెలంగాణ భవన్ కు నోటీసులు

Telangana Bhavan: బీఆర్ఎస్ కు షాక్.. తెలంగాణ భవన్ కు నోటీసులు
telangana news live

Telangana Bhavan updates(Telangana news live):

తెలంగాణ భవన్‌కు రెవెన్యూ శాఖ నోటీసులు జారీ చేసింది. బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో టీ న్యూస్ ఛానల్ ద్వారా వ్యాపారం చేస్తున్నారంటూ నోటీసులో పేర్కొంది. పార్టీ ఆఫీస్ నుంచి టీ న్యూస్ ఛానల్‌ను ఎప్పటిలోగా షిఫ్ట్ చేస్తారో వారంలోగా వివరణ ఇవ్వాలంటూ BRS భవన్ ఇన్‌చార్జ్ శ్రీనివాస్‌రెడ్డిని ఆదేశించింది. 2011 నుంచి టీ న్యూస్ ఛానల్‌ను BRS భవన్‌లోనే యాజమాన్యం నిర్వహిస్తోంది. 2011 ఏప్రిల్ లో టీ న్యూస్ ను స్థాపించగా.. అప్పటి నుంచి ఛానల్ నిర్వహణ తెలంగాణ భవన్ లోనే కొనసాగుతోంది.


నిబంధనలకు విరుద్ధంగా పార్టీ ఆఫీస్ లో టీన్యూస్ ను ఎలా నిర్వహిస్తున్నారో చెప్పాలని రెవెన్యూ శాఖ నోటీసుల్లో పేర్కొంది. కాగా.. టీన్యూస్ ను తెలంగాణ భవన్ నుంచి మరోచోటుకు మార్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ నోటీసుతో ఛానల్ ను శరవేగంగా మార్చే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. నోటీసుల విషయంపై తెలంగాణ భవన్ సిబ్బందిని మీడియా వివరణ కోరగా.. వారు మాట దాటివేయడం గమనార్హం.


Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×