Ian Ward: టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ (England vs India, 5th T20I) మధ్య శనివారం ఐదవ టి20 జరుగుతున్న సంగతి తెలిసిందే. రోజ్ బౌల్, సౌతాంప్టన్ స్టేడియం (The Rose Bowl, Southampton) వేదికగా సాయంత్రం ఏడున్నర గంటలకు మ్యాచ్ ప్రారంభమైంది. అయితే ఇందులో అద్భుతంగా రాణించిన ఇంగ్లాండ్ నిర్నిత 20 ఓవర్లలో కేవలం 3 వికెట్ల నష్టానికి 257 పరుగులు సాధించింది. జోష్ బట్లర్ 131 పరుగులు సాధించగా, హ్యారీ బ్రూక్ 95 పరుగులు చేశాడు. దీంతో ఇంగ్లాండ్ భారీ స్కోర్ నమోదు చేసింది. అయితే ఈ మ్యాచ్ లో బ్రూక్ మూడు పరుగుల వద్ద ఉన్నప్పుడు శివం దుబే మంచి క్యాచ్ వదిలేశాడు. అయితే దీనిపై ఇయాన్ వార్డ్ ( Ian Ward ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టీమిండియా అద్భుతమైన ఫీల్డింగ్ కాస్త కామెడీ షో గా మారిపోయిందని హేళన చేశారు. చేతులకు వచ్చిన క్యాచ్ ను శివమ్ దూబే (Shivam Dube) వదిలేసి… టీమిండియా కొంపముంచాడని చురకలు అంటించారు. ఈ దెబ్బకు టీమిండియా ఓడిపోవడం ఖాయం అంటూ హెచ్చరించారు. ఈ క్రమంలో ఇయాన్ వార్డ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ఐదవ టి20 సందర్భంగా మన ఫీల్డర్స్ చెత్త ప్రదర్శన కనబరిచారు. పదుల సంఖ్యలో మిస్ ఫీల్డ్ లు ఉన్నాయి. ముఖ్యంగా ఇంగ్లాండ్ కెప్టెన్ బ్రూక్, మూడు పరుగుల వద్ద అవుట్ అయ్యేవాడు. ప్రిన్స్ యాదవ్ బౌలింగ్ లో సిక్సర్ కోసం ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే బంతి వెనకాల, పైకి లేచింది. ఈ క్రమంలోనే శివం దూబే క్యాచ్ కోసం ప్రయత్నించాడు. పరిగెత్తి పరిగెత్తి… కింద పడిపోయాడు. క్యాచ్ నేల పాలు చేశాడు. దీంతో ఇంగ్లాండ్ కెప్టెన్ బ్రూక్ కు లైఫ్ వచ్చింది. ఈ క్రమంలోనే 90 కి పైగా పరుగులు సాధించాడు.
అయితే దీనిపై ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ ఇయాన్ వార్డ్ ( Ian Ward ) సంచలన వ్యాఖ్యలు చేశారు. టీమిండియా ప్లేయర్లు మైదానంలో కామెడీ షో చేస్తున్నారని ఎద్దేవా చేశారు. శివం దుబే అయితే… ఇంగ్లాండ్ కెప్టెన్ బ్రూక్ క్యాచ్ కోసం వెళ్లి… బొక్క బోర్ల పడ్డాడని హేళన చేశారు. అసలు అతడు ఎందుకు పరిగెత్తాడు ? క్యాచ్ ఎందుకు వదిలేసాడు ? అనే విషయం అతడికి కూడా తెలియనట్లుగానే వ్యవహరించాడు అంటూ చురకలు అంటించారు. ఇలాంటి ఫీల్డింగ్ తానే ఎప్పుడు చూడలేదని ఫైర్ అయ్యారు. పాకిస్తాన్ కంటే దారుణంగా తయారయ్యారని ఎద్దేవా చేశారు. ఈ ప్లేయర్లతో టి20 వరల్డ్ కప్ 2026 ఎలా టీమిండియా గెలిచిందో అర్థం కావడంలేదని పరువు తీశారు.
Shivam Dube, that was embarassing 😭 pic.twitter.com/vsTcdQgLMy
— Prateek (@prateek_295) July 11, 2026