E-Paper
Advertisement

Telangana Elections : గజ్వేల్ , మేడ్చల్, కామారెడ్డి.. ఈ నియోజకవర్గాల్లోనే అత్యధిక మంది పోటీ..

Telangana Elections :  గజ్వేల్ , మేడ్చల్, కామారెడ్డి.. ఈ నియోజకవర్గాల్లోనే అత్యధిక మంది పోటీ..
Advertisement

Telangana Elections : తెలంగాణలో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ పూర్తైంది. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 4,798 నామినేషన్లు దాఖలయ్యాయి. స్క్రూటినీ ప్రక్రియలో 608 మంది అభ్యర్థుల నామినేషన్లను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. దీంతో ఎన్నికల బరిలో 2,898 మంది అభ్యర్థులు ఉన్నారు.

సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్ లో అత్యధికంగా 114 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలోకి దిగారు. అక్కడ నుంచి బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ పోటీలో ఉన్నారు. ఇక మంత్రి మల్లారెడ్డి పోటీ చేస్తున్న మేడ్చల్‌లో 67 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. సీఎం కేసీఆర్ , టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్న కామారెడ్డిలో 58 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.

Advertisement

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఎల్బీనగర్‌ నియోజకవర్గంలో 50 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ పోటీ చేస్తున్న మరొక స్థానం కొడంగల్‌లో 15 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అత్యల్పంగా నారాయణపేటలో కేవలం ఏడుగురు అభ్యర్థులు మాత్రమే నామినేషన్లు దాఖలు చేశారు. ఆ తర్వాత బాల్కొండ నియోజకవర్గం ఉంది. అక్కడ తొమ్మిది మంది ఎన్నికల బరిలో నిలిచారు.

నామినేషన్ల ఉపసంహరణకు బుధవారం మధ్యాహ్నం వరకు గడువు ఉంది. ఆ తర్వాత మొత్తం బరిలోకి దిగే అభ్యర్థులు ఎంతమందో పూర్తిగా స్పష్టత రానుంది.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×