
Kumarakom : కుమరకోమ్.. కొట్టాయంకు 15 కి.మీ దూరంలో ఆశ్చర్యపరిచే మనోహరమైన ప్రదేశం. కాలువలు, పచ్చని చెట్ల అందాలు, కొండలు, జలపాతాల సొగసులు మిమ్మల్ని కట్టిపడేస్తాయి. రోజువారీ ఉద్యోగ టెన్షన్లు, కుటుంబ ఒత్తిళ్ల నుంచి బ్రేక్ కావాలంటే.. ఈ ప్రకృతి రమణీయ ప్రదేశానికి వెళ్లి చుట్టి రండి.
కుమరకోమ్ బీచ్ ..
సాహస క్రీడలు, జలక్రీడలను ఇష్టపడే వారికి కుమరకోమ్ బీచ్ స్వర్గధామం. ముఖ్యంగా స్కైయింగ్, విండ్ సర్ఫింగ్, బోటింగ్, పారాసైలింగ్ వంటివి ఇక్కడ అందుబాటులో ఉంటాయి.ఈ బీచ్ చుట్టు పక్కల ఉన్న రిసార్టులోని చేపలు, పీతలు, రొయ్యలతో చేసిన వంటకాలు చాలా ప్రాచుర్యం పొందాయి.
విహారానికి కేరాఫ్ అడ్రస్..
కేరళలోని కొట్టాయం నుండి 14 కి.మీ. దూరంలో ఉన్న కుమరకోమ్ ప్రపంచవ్యాప్తంగా బ్యాక్ వాటర్స్ క్రూయిజ్‌లకు పర్యాయపదంగా చెప్పొచ్చు. వెంబనాడ్ సరస్సు చుట్టూ ఉన్న సుందరమైన ద్వీపాల సమూహం ఈ ప్రదేశం. బ్యాక్ వాటర్స్ విహారానికి కేరాఫ్ అడ్రస్‌గా కుమరకోమ్ గుర్తింపు పొందింది. ఇది కొచ్చి నుండి 70 కి.మీ. దూరంలో ఉంది.