BigTV English

Sharmila : తగ్గదేలే.. ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై షర్మిల మళ్లీ ఫైర్..

Sharmila : తగ్గదేలే.. ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై షర్మిల మళ్లీ ఫైర్..

Sharmila : మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల మరోసారి ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యే తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, తీవ్ర పదజాలంతో దూషించారని మండిపడ్డారు. ఓ మహిళను ఎలాంటి మాటలైనా అంటారా అని ఎమ్మెల్యేను ప్రశ్నించారు. శంకర్ నాయక్ వేల ఎకరాలు కబ్జా చేశారని ఆరోపించారు. మహబూబాబాద్‌లో పాదయాత్రకు పోలీసులు అనుమతిని రద్దు చేసి షర్మిలను అరెస్ట్‌ చేసి హైదరాబాద్‌ తీసుకొచ్చారు. ఈ సమయంలో షర్మిల ఎమ్మెల్యేపై మరోసారి విమర్శలకు దిగారు. శంకర్ నాయక్ ఆగడాలంటూ కొన్ని వీడియో క్లిప్ లను ప్రదర్శించారు.


మహబూబాబాద్‌లో 2014లో ప్రభుత్వ భూములు 2,170 ఎకరాలున్నాయని షర్మిల తెలిపారు. అందులో ఇప్పటి వరకు 2,100 ఎకరాలను కబ్జా చేశారని ఆరోపించారు. ఎమ్మెల్యే .. చెరువులు, గిరిజన భూములు కబ్జా చేశారని కొంతమంది చెబుతున్నారని తెలిపారు. తన వద్దకు ఎన్నో ఫిర్యాదులు వస్తే వాటని ఆధారాలు జతపరిచి చెప్పామన్నారు. మహబూబాబాద్ లో‌ జర్నలిస్టులకు ప్లాట్లు ఇస్తామని చెప్పి డబ్బులు తీసుకుని మోసం చేశారని ఆరోపించారు.
శంకర్‌నాయక్‌ అవినీతిపరుడేనని షర్మిల మరోసారి స్పష్టం చేశారు. తనపై చేసిన కామెంట్లకూ బదులిచ్చానని తేల్చిచెప్పారు.

రాజశేఖర్‌రెడ్డిది రాజ్యం దొంగలరాజ్యం అని.. వలసదారులు వచ్చి పార్టీలు పెడుతున్నారని శంకర్‌నాయక్‌ అన్నారని షర్మిల తెలిపారు. తనను పరుష పదజాలంతో సంబోధించారని చెప్పారు. మహిళను ఉద్దేశించి నోటికేది వస్తే అది అంటే ఊరుకోవాలా? అని షర్మిల నిలదీశారు. తన ఎస్కార్ట్‌ వాహనం, అంబులెన్స్‌పై బీఆర్ఎస్ శ్రేణులు దాడి చేశాయని ఆరోపించారు.


Sayanna : సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి. సాయన్న మృతి..

Sharmila: వైఎస్ షర్మిల అరెస్ట్.. పాదయాత్ర అనుమతి రద్దు

Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×