
YS Sharmila joins congress(Telangana politics):
YSRTPని కాంగ్రెస్‌లో విలీనం చేసే ప్రక్రియ కీలక దశకు చేరుకున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్‌తో తుది దఫా చర్చలు జరిపేందుకు షర్మిల మరోసారి ఢిల్లీ వెళ్లారు. షర్మిలతో పాటు ఆమె భర్త అనిల్ కూడా హస్తిన చేరుకున్నారు. గతంలోనూ భర్త అనిల్‌తో కలసి 2 రోజులు ఢిల్లీలో ఉన్న షర్మిల.. కాంగ్రెస్ అధిష్టానంతో సంప్రదింపులు జరిపారు. ఆ పర్యటనలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తోనూ భేటీ అయ్యారు.
గురువారం కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీతో షర్మిల దంపతులు సమావేశం అవుతారని తెలుస్తోంది. ప్రియాంకతో మీటింగ్ తర్వాత పార్టీ విలీనం ప్రకటన చేస్తారని వార్తలు వస్తున్నాయి.
షర్మిల పాలేరు అసెంబ్లీ టికెట్ ఆశిస్తున్నారు. గతంలో ఆమె పాలేరు నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. కానీ.. మాజీమంత్రి తుమ్మల కాంగ్రెస్‌లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఆయనొస్తే.. ఈమెకు టికెట్ రాకపోవచ్చు.
ఇక, షర్మిలకు సికింద్రాబాద్ టికెట్ ఇస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. అక్కడ బీజేపీ నుంచి జయసుధ పోటీ చేస్తారని తెలుస్తోంది. క్రిస్టియన్ ఓట్లు అధికంగా ఉన్న సికింద్రాబాద్ నుంచి షర్మిలను బరిలో నిలిపితే విజయావకాశాలు ఎక్కువ అని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారట.
ఒకవేళ షర్మిలను అసెంబ్లీ బరిలో నిలపకపోతే.. కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపించే అవకాశం ఉంది. అలా చేస్తే.. ఆమె సేవలు ఏపీలో వినియోగించుకోవచ్చనేది హస్తం పార్టీ ఆలోచనగా తెలుస్తోంది.
అయితే, పోటీ సరే.. తనకిచ్చే పదవుల సంగతి ముందే తేల్చాలంటూ షర్మిల పట్టుబడుతున్నట్టు సమాచారం. తనను స్టార్ క్యాంపెయినర్‌గా నియమించాలనే డిమాండ్‌తో పాటు.. తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే.. ఏకంగా హోం మినిస్ట్రీ, డిప్యూటీ సీఎం, మహిళా కోటాలో ముఖ్యమంత్రి పదవిపైనే కన్నేశారట షర్మిల.
KA Paul : మునుగోడులో ‘పాల్’ హల్ చల్.. హామీలు వింటే అవాక్కవ్వాల్సిందే..