
RaviTeja: రవితేజ అభిమానులకు షాకింగ్ న్యూస్. టైగర్ నాగేశ్వరరావు చిత్ర విడుదల నిలిపివేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరావు సినిమాపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సినిమా ట్రైలర్‌లో డైలాగులను తప్పుపట్టింది.
ఒకప్పుడు దేశాన్ని వణికించిన స్టూవర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతుంది టైగర్ నాగేశ్వరరావు. రవితేజ టైటిల్ రోల్ చేస్తున్నారు. దర్శకుడు వంశీ తెరకెక్కిస్తున్నారు. టైగర్ నాగేశ్వరరావు చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 20న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ చిత్ర విడుదలకు బ్రేక్ పడే సూచనలు కనిపిస్తున్నాయి. టైగర్ నాగేశ్వరరావు చిత్ర విడుదల నిలిపివేయాలంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
పిటిషనర్ తరపు న్యాయవాది పృథ్వి వాదనలు వినిపించారు. కేసును విచారణకు స్వీకరించిన హైకోర్టు చిత్ర నిర్మాతతో పాటు పిటిషన్ లో పేర్కొన్న ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది. దీంతో రవితేజ ఫ్యాన్స్ నిరాశకు గురవుతున్నారు.