E-Paper
Advertisement

MHSRB: ఈరోజు నుంచే స్టాఫ్‌నర్స్ పోస్టులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్.. ఎప్పటివరకంటే?

MHSRB: ఈరోజు నుంచే స్టాఫ్‌నర్స్ పోస్టులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్.. ఎప్పటివరకంటే?
Advertisement

MHSRB: తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 7,094 స్టాఫ్ నర్స్ పోస్టులకు ఇటీవల నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు ఆగస్టు 2న కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించారు. అయితే ఈ ఎగ్జామ్‌కు దాదాపు 40 వేల మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ కీని ఆగస్టు 7న విడుదల చేశారు. ఆన్సర్ కీ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని డిసెంబరు 18న తుది ఆన్సర్ కీతో పాటు ఫలితాలను MHSRB విడుదల చేసింది. ఇక తాజాగా అభ్యర్థుల మెరిట్ జాబితాను రిలీజ్ చేసింది.

ఇందులో మెరిట్ పొందిన అభ్యర్థులకు డిసెంబరు 30 నుంచి జనవరి 6 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ నిర్వహించనున్నారు. హైదరాబాద్‌ బండ్లగూడలోని ఎక్సైజ్‌ అకాడమీ ప్రాంగణంలో అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు. అభ్యర్థులను 1 : 1.25 నిష్పత్తిలో సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ కోసం ఎంపికచేసింది.

Advertisement

అభ్యర్థులు సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌కు హాజరుకాకపోయినా.. కావాల్సిన పత్రాల్లో ఏవైనా సమర్పించకపోయినా వారి అభ్యర్థిత్వాన్ని రద్దు చేయనున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య సేవల రిక్రూట్‌మెంట్‌ బోర్డు (MHSRB) స్పష్టం చేసింది. మొత్తం 8892 మంది అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు.

సర్టిఫికేట్ వెరిఫికేషన్ షెడ్యూలు ఇలా..

  • డిసెంబరు 30న – 1200 మంది అభ్యర్థులకు
  • జనవరి 1న – 1350 మంది అభ్యర్థులకు
  • జనవరి 2న – 1500 మంది అభ్యర్థులకు
  • జనవరి 3న – 1500 మంది అభ్యర్థులకు
  • జనవరి 4న – 1500 మంది అభ్యర్థులకు
  • జనవరి 5న – 1500 మంది అభ్యర్థులకు
  • జనవరి 6న – 342 మంది అభ్యర్థులకు
Tags

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×