E-Paper
Advertisement

MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న విజయం !

MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న విజయం !
Advertisement

MLC By Elections in Telangana(TS today news): తెలంగాణలో హోరాహోరీగా సాగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థిపై 19,375 ఓట్ల ఆదిక్యంలో మల్లన్న ఉన్నారు. అయితే బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి మేజిక్ ఫిగర్ రాకపోవడంతో అతడిని ఎలిమినేట్ చేసే అవకాశం ఉంది. కాసేపట్లో అధికారులు తుదిఫలితం ప్రకటించనున్నారు. మల్లన్న గెలుపు ఖాయమవడంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.

నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ తుది దశకు చేరుకుంది. మొత్తం  అభ్యర్థుల్లో 47 మందిని ఎలిమినేషన్ ప్రక్రియలో తొలగించారు. స్వతంత్ర అభ్యర్థి పాలకూరి అశోక్, బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ కూడా ఎలిమినేట్ అయ్యారు. 47 మంది అభ్యర్థులను ఎలిమినేట్ చేసిన తర్వాత తీన్మార్ మల్లన్నకు అత్యధిక మెజారిటీ ఉంది. గెలుపు కోసం కావాల్సిన ఓట్లు లేకపోవడంతో రాకేష్ రెడ్డిని ఎలిమినేట్ చేసే అవకాశం ఉంది.

Advertisement

Also Read: ధాన్యం ఉత్పత్తిలో అగ్రగామిగా తెలంగాణ: మంత్రి తుమ్మల

మెజారిటీ తీన్మార్ మల్లన్నకు రావడంతో కౌంటింగ్ సెంటర్ వద్దకు భారీగా కాంగ్రెస్ నేతలు,కార్యకర్తలు చేరుకుంటున్నారు. బాణసంచా పేల్చుతూ సంబరాలు జరుపుకుంటున్నారు.

Tags

Related News

బీజేపీలోకి కొండా సురేఖ.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ డీకే అరుణ!

కాన్‌స్టర్ సొల్యూషన్స్ ప్రారంభోత్సవంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!

కామారెడ్డి జిల్లాలో ఘోరం.. ఆర్టీసీ బస్సు బోల్తా స్పాట్‌లో 13 మంది..!

మాదాపూర్‌లో ఈ-సిగరెట్ల దందా గుట్టురట్టు.. పోలీసులకు ఎలా చిక్కారంటే..?

ఖమ్మం జిల్లాలో చైనా సైబర్ గ్యాంగ్ దందా కలకలం.. 52 మంది యువకులు అరెస్ట్!

కేసీఆర్‌కు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్..!

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

Big Stories

Advertisement
×