E-Paper
Advertisement

Telangana and AP Chief Ministers Meeting: నేడే తెలుగు రాష్ట్రాల సీఎంల కీలక భేటీ..చర్చపై ఉత్కంఠ!

Telangana and AP Chief Ministers Meeting: నేడే తెలుగు రాష్ట్రాల సీఎంల కీలక భేటీ..చర్చపై ఉత్కంఠ!
Advertisement

Telangana and AP Chief Ministers Meeting(Telangana news live): తెలుగు రాష్ట్రాల సీఎంలు సుదీర్ఘ కాలం తర్వాత తొలిసారి భేటీ అవుతున్నారు.తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శనివారం సాయంత్రం 6 గంటలకు సమావేశం కానున్నారు. హైదరాబాద్‌లోని ప్రజాభవన్ వేదికగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ కానున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

ఆంధ్రప్రదేశ్ పునర్విభజన జరిగిన తర్వాత విభజనకు సంబంధించి అపరిష్కృతంగా ఉన్న అంశాలపై ముఖ్యమంత్రులు ఇద్దరు భేటీ కావడం ఇదే మొదటి సారి కావడం విశేషం. అయితే, ప్రధానంగా షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లో ఉన్న సంస్థల విభజనపై చర్చించే అవకాశం ఉంది. అలాగే ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు, అంశాలను స్నేహపూరిత వాతావరణంలో పరిష్కరించుకోనున్నారు. దీంతోపాటు భద్రాచలాన్ని ఆనుకొని ఉన్న ఐదు గ్రామపంచాయతీల విలీనం అంశంపై కూడా ఈ భేటీలో చర్చించే అవకాశం ఉందని సమాచారం.

Advertisement

ప్రధానంగా విద్యుత్ సంస్థలకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య బకాయిలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఏపీ స్థానికత కలిగిన 1853 మంది విద్యుత్ ఉద్యోగుల వేతనాల వ్యత్యాసం, సర్దుబాటు అంశంతోపాటు పౌరసరఫరాల శాఖకు చెందిన ఫుడ్ క్యాష్ క్రెడిట్, వడ్డీ అంశం కూడా చర్చింనున్నట్లు తెలుస్తోంది. దాదాపు రూ.24వేల కోట్లు ఏపీ ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని తెలంగాణ సర్కార్ చెబుతుండగా.. ఏపీ మాత్రం రూ.7వేల కోట్లు చెల్లించాల్సి ఉందని పేర్కొంటుంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విభజనకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు.

Related News

బీజేపీలోకి కొండా సురేఖ.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ డీకే అరుణ!

కాన్‌స్టర్ సొల్యూషన్స్ ప్రారంభోత్సవంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!

కామారెడ్డి జిల్లాలో ఘోరం.. ఆర్టీసీ బస్సు బోల్తా స్పాట్‌లో 13 మంది..!

మాదాపూర్‌లో ఈ-సిగరెట్ల దందా గుట్టురట్టు.. పోలీసులకు ఎలా చిక్కారంటే..?

ఖమ్మం జిల్లాలో చైనా సైబర్ గ్యాంగ్ దందా కలకలం.. 52 మంది యువకులు అరెస్ట్!

కేసీఆర్‌కు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్..!

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

Big Stories

Advertisement
×