E-Paper
Advertisement

Telangana CM : సీఎం ప్రమాణస్వీకార కార్యక్రమం.. ముఖ్య అతిథులు వీరే..!

Telangana CM : సీఎం ప్రమాణస్వీకార కార్యక్రమం.. ముఖ్య అతిథులు వీరే..!
Advertisement

Telangana CM : తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని గ్రాండ్ గా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులను ఆహ్వానించారు. ప్రస్తుతం రేవంత్‌ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఇప్పటికే సోనియా గాంధీ, రాహుల్‌ , ప్రియాంక, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్‌ను కలిశారు. తన ప్రమాణ స్వీకారానికి రావాలని ఆహ్వానించారు. మరోవైపు ఏఐసీసీ నేతలకు, ఇతర రాష్ట్రాల కాంగ్రెస్ ముఖ్య నేతలకు ఆహ్వానాలు పంపారు.

కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, కర్ణాటక మంత్రులను ఆహ్వానించారు. రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లట్, ఛత్తీస్‌గఢ్‌ మాజీ సీఎం భూపేష్ బఘెల్, మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చౌహన్ కు పిలుపు అందింది. ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌, తమిళనాడు సీఎం స్టాలిన్, కేసీఆర్‌కు కూడా ఆహ్వానం పంపారు. గతంలో ఇన్ ఛార్జీలుగా దిగ్విజయ్ సింగ్, వీరప్ప మొయిలీ, కుంతియా, వాయిలార్ రవి, మాణిక్కం ఠాకూర్ ను ఆహ్వానించారు.

Advertisement

తెలంగాణ ఏర్పాటు కీలక పాత్ర పోషించిన చిదంబరం, మీరాకుమారి, సుశీల్ కుమార్ షిండే, కురియన్ ను ఆహ్వానించారు. తెలంగాణ ఉద్యమ అమరుల కుటుంబాలకు ఆహ్వానం పంపారు. ప్రొఫెసర్ కోదండరామ్, గాదె ఇన్నయ్య, హరగోపాల్, కంచె ఐలయ్యతోపాటు ఉద్యమకారులకు పిలిచారు. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల అధినేతలకు ఆహ్వానం పంపుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, పలువురు సినీ నటులకు ఆహ్వానిస్తున్నారు. హైకోర్టు చీఫ్ జస్టిస్‌తోపాటు వివిధ కులసంఘాల నేతలకు, మేధావులకు ఆహ్వానం పంపుతున్నారు.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×