E-Paper
Advertisement

Revanth Reddy Delhi Tour : ఢిల్లీ టూర్‌లో రేవంత్ బిజీబిజీ.. ఏఐసీసీ అగ్రనేతలతో సమావేశం..

Revanth Reddy Delhi Tour : ఢిల్లీ టూర్‌లో రేవంత్ బిజీబిజీ.. ఏఐసీసీ అగ్రనేతలతో సమావేశం..
Advertisement
Revanth Reddy Delhi Tour

Revanth Reddy Delhi Tour(Congress news telangana) :

హైకమాండ్ ఆదేశాల మేరకు రేవంత్‌ రెడ్డి నిన్న రాత్రి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీ విమానాశ్రయంలో అధికారిక లాంఛనాలతో రేవంత్‌కు తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్.. ఘనస్వాగతం పలికారు. AICC నాయకురాలు సోనియాగాంధీని కలిశారు రేవంత్ రెడ్డి. రేపు జరిగే తన ప్రమాణస్వీకార కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. అంతకుముందు.. రేవంత్ AICC చీఫ్ మల్లికార్జున ఖర్గే, డీకే శివకుమార్, కేసీ వేణుగోపాల్ తోనూ సమావేశమయ్యారు.

telangana congress news today
telangana congress party news

రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీతో రేవంత్‌ రెడ్డి భేటీ అయ్యారు. ఈ భేటీలో మంత్రివర్గ ఏర్పాటు, ఇతర అంశాలపై చర్చించారు. ఆ తర్వాత రేవంత్‌ రెడ్డి ఏఐసీసీ అగ్రనేతలను విడివిడిగా కలిశారు. ఏఐసీసీ ముఖ్యనేతలను ప్రమాణ స్వీకారానికి రేవంత్ రెడ్డి ఆహ్వానించారు.

Rahul Gandhi Latest news
Advertisement

రేపు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేపు జరగబోయే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అధిష్టానం పెద్దలను ఆహ్వానించారు. ఉపముఖ్యమంత్రితోపాటు మంత్రివర్గంలో ఎవరెవరికి అవకాశం కల్పించాలి అనేదానిపై అధిష్టానంతో రేవంత్ రెడ్డి చర్చించారు.

తెలంగాణ నూతన సీఎంగా రేవంత్ రెడ్డి పేరును మంగళవారం రాత్రి కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ మేరకు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటన చేశారు. తెలంగాణ కాంగ్రెస్ సీఎల్పీ తీర్మానాన్ని పరిశీలించిన అనంతరం సీఎంగా రేవంత్ రెడ్డిని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిర్ణయించారని వెల్లడించారు. సీఎల్పీ నేతగా రేవంత్ రెడ్డి పేరును అనౌన్స్ చేశారు. అయితే నిన్న రేవంత్‌ను ఢిల్లీ రావాలని హైకమాండ్ ఆదేశించింది. ఎఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌ నిన్న సాయంత్రం ముఖ్యనేతల సమక్షంలో చర్చలు జరిపి తెలంగాణ సీఎంగా రేవంత్‌ రెడ్డి పేరును ఖరారు చేశారు.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×