E-Paper
Advertisement

Guntur Kaaram: గుంటూరు కారం నుంచి సెకండ్ సాంగ్.. ఎప్పుడంటే..

Guntur Kaaram: గుంటూరు కారం నుంచి సెకండ్ సాంగ్.. ఎప్పుడంటే..

Guntur Kaaram: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్.. సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం గుంటూరు కారం. ఇందులో శ్రీలీల, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. సర్కారువారి పాట తర్వాత మహేష్ నటిస్తోన్న సినిమా ఇదే కావడం, 12 ఏళ్ల తర్వాత త్రివిక్రమ్ మళ్లీ మహేష్ తో చేస్తున్న సినిమా అవ్వడంతో గుంటూరు కారంపై భారీ అంచనాలున్నాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో అతడు, ఖలేజా సినిమాలు డిఫరెంట్ జోనర్స్ లో వచ్చి ప్రేక్షకులను అలరించాయి.

గుంటూరు కారం పక్కా మాస్ మసాలా ఎంటర్టైనర్ కావడంతో.. సూపర్ స్టార్ అభిమానులు సినిమా అప్డేట్స్ కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటి వరకూ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, ఇటీవలే వచ్చిన దమ్ మసాలా సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటూ.. మంచి బజ్ ను క్రియేట్ చేశాయి. మరోవైపు సోషల్ మీడియాలో గుంటూరు కారం నుంచి లీకైన మహేష్ డాన్స్ వీడియోలు, ఫొటోలు వైరల్ అయ్యాయి.

తాజాగా గుంటూరు కారం సెకండ్ సాంగ్ రిలీజ్ పై అప్డేట్ ఇచ్చింది చిత్రబృందం. ఇటీవలే హీరో నితిన్ త్రివిక్రమ్ ను కలిసిన సమయంలో సెకండ్ సాంగ్ పై అప్డేట్ ఇవ్వగా.. దానికి రిప్లై ఇస్తూ.. రెండ్రోజుల్లోనే అప్డేట్ ఇస్తామని నిర్మాత నాగవంశీ రిప్లై ఇచ్చారు. అంటే రేపో, ఎల్లుండో గుంటూరు కారం సెకండ్ సాంగ్ పై అప్డేట్ వస్తుందని అభిమానులు భావిస్తున్నారు. ఈ సాంగ్ షూటింగ్ ప్రస్తుతం కేరళలో మహేష్ – శ్రీలీల పై జరుగుతోందని తెలుస్తోంది.

Related News

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Big Stories

×