Telangana Election Results : తెలంగాణలో కాంగ్రెస్ గాలి.. ఆ జిల్లాల్లో ఏకపక్షంగా తీర్పు!: తెలంగాణలో అన్ని జిల్లాలో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శిస్తోంది.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 స్థానాల్లో కాంగ్రెస్ 8 చోట్ల లీడ్ లో ఉంది. బీఆర్ఎస్ కేవలం 4 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 నియోజకవర్గాల్లో 9 స్థానాల్లో కాంగ్రెస్ దూసుకుపోతోంది. బీఆర్ఎస్ కు ఒక్క చోట కూడా లీడ్ రాలేదు. మరోస్థానంలో సీపీఐ ఆధిక్యంలో ఉంది.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ దూకుడుగా ఉంది. మొత్తం 12 స్థానాల్లో 11 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపు దిశగా దూసుకుపోతున్నారు. బీఆర్ఎస్ ఒక్క చోట మాత్రమే లీడ్ లో ఉంది.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 14 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉండగా.. అందులో కాంగ్రెస్ 7 చోట్ల ఆధిక్యంలో ఉంది. బీఆర్ఎస్ 6 స్థానాల్లో లీడ్ లో ఉంది.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో త్రిముఖ పోరు నెలకొంది. నాలుగు చోట్ల కాంగ్రెస్, బీఆర్ఎస్ 3 స్థానాల్లో, బీజేపీ రెండు చోట్ల ఆధిక్యంలో ఉంది.
ఆదిలాబాద్ లో జిల్లాలో త్రిముఖ పోరు జరుగుతోంది. కాంగ్రెస్, బీజేపీ కాంగ్రెస్ నువ్వానేనా అన్నట్టు పోటీ పడుతున్నాయి. చెరోలో నాలుగు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. బీఆర్ఎస్ ఇక్కడ మూడో స్థానంలో ఉంది. గులాబీ పార్టీ ఈ జిల్లాలో రెండు స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది.
ఉమ్మడి కరీంనగర్ లో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. ఇక్కడ హస్తం పార్టీ 9 చోట్ల గెలుపు దిశగా సాగుతోంది. కారు జోరు 4 స్థానాల్లోనే కనిపిస్తోంది.
హైదరాబాద్ లో అధికార పార్టీ ఆధిక్యంలో ఉంది. మొత్తం 15 స్థానాల్లో 7 చోట్ల కారు జోరుమీదుంది. బీజేపీ నాలుగు చోట్ల, ఎంఐఎం 3 చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి.
రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ 9 చోట్ల, కాంగ్రెస్ 3 చోట్ల లీడ్ లో ఉన్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. బీఆర్ఎస్ 5 చోట్ల, కాంగ్రెస్ నాలుగు చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి.