Four States Results: తెలంగాణతో పాటు మరో మూడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. మధ్యప్రదేశ్ లో కమలం పార్టీ మ్యాజిక్ ఫిగర్ ను దాటింది. ఇక్కడ 230 నియోజకవర్గాలకు గాను బీజేపీ 162 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 116 స్థానాల్లో గెలవాల్సి ఉంది. ప్రస్తుతం బీజేపీ లీడింగ్ లో ఉండగా.. కమలం పార్టీనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. బీజేపీ ఏకపక్ష విజయం కాంగ్రెస్ 64 స్థానాల్లో లీడింగ్ లో ఉండగా.. ఇతరులు 2 స్థానాల్లో ముందంజలో ఉన్నారు.
తెలంగాణ ఓట్ల లెక్కింపులో హస్తం గాలి వీస్తోంది. 119 అసెంబ్లీ స్థానాలకు గాను.. కాంగ్రెస్ ఇప్పటి వరకూ 62 స్థానాల్లో లీడింగ్ లో ఉంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న బీఆర్ఎస్ 43 స్థానాల్లో, బీజేపీ 8 స్థానాల్లో, ఇతరులు 5 స్థానాల్లో లీడింగ్ లో కొనసాగుతున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు కనీసం 60 సీట్లు అవసరం.
రాజస్థాన్ లోనూ బీజేపీ హవా కనిపిస్తోంది. ఇక్కడ 199 స్థానాలకు బీజేపీ 104 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా.. కాంగ్రెస్ 75 స్థానాల్లో, ఇతరులు 19 స్థానాల్లో లీడింగ్ లో ఉన్నారు.
ఛత్తీస్ గఢ్ లో బీజేపీ- కాంగ్రెస్ ల మధ్య టఫ్ ఫైట్ జరుగుతోంది. ఇక్కడ రెండోసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు గాను.. బీజేపీ 45 స్థానాల్లో, కాంగ్రెస్ 43 స్థానాల్లో లీడింగ్ లో ఉన్నాయి. గతంలో ఇక్కడ బీజేపీ 15 స్థానాలకు పరిమితమవ్వగా.. ఇప్పుడు అంతకు రెండింతల స్థానాల్లో విజయావకాశాలు కనిపిస్తున్నాయి.