
Telangana Elections : సంక్షేమ పథకాలనే పార్టీలు నేరుగా ఎన్నికల తాయిలాలుగా ఉపయోగించుకుంటున్నాయా? ప్రజల ఖాతాల్లో టైమ్ చూసి నగదు జమ చేస్తున్నాయా? ఓటర్లకి పార్టీ తరఫున ఫండ్‌లా ప్రజాధనాన్ని అకౌంట్‌లో వేస్తున్నాయా? ప్రభుత్వ పథకాల పేరుతో విపక్షాలని దెబ్బతీసే అస్త్రంగా వాడుకుంటున్నాయా? అంటే సమాధానం అవును అనే వస్తోంది. తెలంగాణతో పాటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఇదే ఫార్మూలాని ఫాలో అవుతున్నాయని కాంగ్రెస్ పార్టీ మండిపడుతోంది. ఎన్నికలు చూసుకొని మరి నిధులు విడుదల చేస్తున్నాయని ఫైరవుతోంది. ఎన్నికల సంఘం కూడా ప్రేక్షకపాత్ర పోషిస్తోందని హస్తం పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందంటే పాలకులు కొత్త నిర్ణయాలు తీసుకోకూడదు. ప్రజల్ని ప్రలోభ పెట్టేలా ఆదేశాలివ్వకూడదు. అభివృద్ధి పనులు కూడా నిలిపివేయాలి. ఎన్నికల నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. వీటిని ఉల్లంఘించడానికి వీళ్లేదు. అయితే ఇదంతా మాటలకే పరిమితం అవుతోందనే ఆరోపణలు వస్తున్నాయి. అధికార పార్టీలు పాత నిర్ణయాల పేరుతో ప్రలోభాలకు తెరలేపుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన నగదుని సరిగ్గా ఎలక్షన్ టైమ్‌లోనే విడుదల చేస్తున్నాయి. ఈ విషయంలో తెలంగాణలో BRS, కేంద్రంలోని బీజేపీ ఒకే తరహాలో వ్యవహరిస్తున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో బీజేపీ పీఎం కిసాన్ నిధులు విడుదల చేసింది. రైతులకు పెట్టుబడి సాయంగా కేంద్రం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో ఆర్థిక సాయం చేస్తోంది. 15వ విడత కింద అర్హులైన దాదాపు 8 కోట్లమందికి పైగా రైతుల ఖాతాల్లో 2వేల చొప్పున కేంద్రం నగదుని జమచేసింది.
దేశవ్యాప్తంగా రైతులకు లబ్ధి చేకూరేలా కేంద్రం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పేరిట పథకాన్ని అమలు చేస్తోంది. ఏడాదిలో మూడు దఫాలుగా 6వేలు రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తోంది. ఒక్కో విడతలో అర్హులైన రైతుల ఖాతాల్లోకి 2వేల చొప్పున వేస్తోంది. కేంద్రం ఇప్పటిదాకా ఈ పథకం కింద 14 విడతలుగా నిధులను విడుదల చేసింది. తాజాగా నవంబర్ 15న 15వ విడత నిధులు విడుదల చేసింది. ఇదే ఇప్పుడు విమర్శలకి తావిచ్చేలా చేస్తోంది. ఎన్నికలు చూసుకొని మరీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిధులు విడుదల చేస్తోందని కాంగ్రెస్ పార్టీ మండిపడింది. ఒక్కో విడతలో ఒక్కో తేదీల్లో ఎందుకు డబ్బులు జమ చేస్తున్నారంటూ కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ప్రశ్నించారు. ఈ మేరకు నిధుల విడుదల డేట్‌లతో Xలో ట్వీట్ చేశారు. రెండు వారాల వ్యవధిలోనే నాలుగు రాష్ట్రాల ఎన్నికలు ఉండగా లబ్ధి కోసమే బీజేపీ ఇలాంటి ఎత్తుగడలని అమలు చేస్తోందని జైరాం ఫైరయ్యారు. రెండు రోజుల్లో మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ ఎన్నికలు ఉండగా ఇదేం నిర్ణయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే తెలంగాణలోనూ రెండు వారాల్లో ఎలక్షన్స్ ఉండగా పీఎం కిసాన్ నిధులు విడుదల చేసి ప్రలోభాలకి గురి చేస్తున్నారని విమర్శించారు.
తెలంగాణలోనూ అధికార బీఆర్ఎస్ పార్టీ ఇదే తరహా ఎత్తుగడ అమలు చేసేందుకు రెడీ అయింది. అయితే ఖజానాలో కాసులు లేవనే డొల్లతనం ఎక్కడ బయటపడుతుందో అని నెపాన్ని కాంగ్రెస్ పార్టీపైకి నెట్టేసింది. రైతు బంధు, రుణమాఫీ నిధులు జమ చేయకుండా చూడాలంటూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిందనే అబద్ధపు ప్రచారానికి తెరలేపింది. ఇదే విషయంపై కాంగ్రెస్ నేతలు క్లారిటీ ఇచ్చారు. పోలింగ్ డేట్ కంటే ముందే రైతుల ఖాతాల్లో నగదు జమ చేయాలని సూచించారు. అయినప్పటికీ బీఆర్ఎస్ నగదు విడుదలపై కినుక వహిస్తోంది. నిధులు లేకపోవడం వల్ల ఆ నెపాన్ని హస్తం పార్టీవైపు నెట్టి తప్పించుకోవాలని ప్రయత్నించింది. మరి కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ నిధులు విడుదల చేయగా.. మరి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఆటంకాలు ఏంటని రైతులు నిలదీస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి అడ్డురాని నిబంధనలు తెలంగాణలో కేసీఆర్ సర్కార్‌కి వచ్చాయా అని మండిపడుతున్నారు. చిత్తశుద్ధి ఉంటే రుణమాఫీ సహా రైతు బంధు నిధులు వెంటనే విడుదల చేయాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులు లేవనే విషయాన్ని ప్రస్తావించకుండా బీఆర్ఎస్ నేతలు కూడా దీన్నో ప్రచారాస్త్రంగా మలచుకుంటున్నారు. కాంగ్రెస్ వల్లే రైతు బంధు, రుణమాఫీ నిధులు వేయలేకపోతున్నామని తప్పించుకునేందుకు దారులు వెతుక్కుంటున్నారు. బహిరంగ సభల్లోనూ ఇదే విషయాన్ని చెబుతూ రైతులను మోసం చేస్తున్నారు. పాలకుర్తి ప్రజాశీర్వాద సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఇలాంటి వ్యాఖ్యలే చేయడం అధికార పార్టీ నైజాన్ని బయటపడేలా చేసింది.
బీఆర్ఎస్ అసత్య ప్రచారం చేస్తోందని కాంగ్రెస్ పార్టీ క్లియర్‌గా చెబుతోంది. ఇప్పుడు కేంద్రం కూడా పీఎం కిసాన్ నిధులు విడుదల చేయగా దానికి బలం చేకూరేలా చేసింది. తాము అధికారంలోకి రాగానే రెండు లక్షల రుణమాఫీ సహా రైతు బంధు పెంపుతో అమలు చేస్తామని హస్తం పార్టీ భరోసా ఇస్తోంది. కౌలు రైతులకు ఆర్థిక సాయానికి గ్యారెంటీ ఇచ్చింది. ఇవన్నీ తప్పుదోవ పట్టించేలా బీఆర్ఎస్ వ్యవహారిస్తోందని.. అయితే వాటిని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు బోధన్ ప్రజాశీర్వాద సభలో సీఎం కేసీఆర్ ఫ్రస్ట్రేట్ అయ్యారు.