BigTV English

Telangana Government : రిటైర్డ్ ఎంప్లాయిస్ పై ప్రభుత్వం ఫోకస్.. ఉద్యోగుల గుండెల్లో గుబులు..

Telangana Government : ప్రభుత్వ అధికారులు పదవీ విరమణ పొందినా వివిధ ప్రభుత్వ శాఖల్లో కొనసాగుతున్నవారిపై దృష్టిసారించింది తెలంగాణ సర్కార్‌. ఎక్స్‌టెన్షన్‌, రీ అపాయింట్‌మెంట్‌, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ పేరుతో పనిచేస్తున్న రిటైర్డ్‌ ఉద్యోగులు వంద మంది ఉన్నట్లు లెక్క తేలింది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాట్లు తెలుస్తోంది. సీఎస్‌ శాంతి కుమారి ఆదేశాలతో రిటైర్డ్‌ ఉద్యోగుల వివరాలను పొందుపరిచేందుకు ఒక నిర్ధిష్టమైన ఫార్మాట్‌ను కూడా రూపొందించి అన్ని ప్రభుత్వ శాఖలకు పంపడంతో ఆ వివారాలను సేకరించి సీల్డ్‌ కవర్‌లో సీఎస్‌కు అందించింది. దీంతో జిల్లా కలెక్టరేట్లలో, ఇతర ప్రభుత్వ శాఖల్లో ఉన్నతాధికారులు వివిధ హోదాల్లో ఇప్పటికీ కొలువుల్లో కొనసాగుతున్న రిటైర్డ్‌ ఉద్యోగుల గుండెల్లో గుబులు రేగుతోంది.

Telangana Government : రిటైర్డ్ ఎంప్లాయిస్ పై ప్రభుత్వం ఫోకస్.. ఉద్యోగుల గుండెల్లో గుబులు..
ts news updates

Telangana Government news(TS news updates):

ప్రభుత్వ అధికారులు పదవీ విరమణ పొందినా వివిధ ప్రభుత్వ శాఖల్లో కొనసాగుతున్నవారిపై దృష్టిసారించింది తెలంగాణ సర్కార్‌. ఎక్స్‌టెన్షన్‌, రీ అపాయింట్‌మెంట్‌, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ పేరుతో పనిచేస్తున్న రిటైర్డ్‌ ఉద్యోగులు వంద మంది ఉన్నట్లు లెక్క తేలింది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాట్లు తెలుస్తోంది. సీఎస్‌ శాంతి కుమారి ఆదేశాలతో రిటైర్డ్‌ ఉద్యోగుల వివరాలను పొందుపరిచేందుకు ఒక నిర్ధిష్టమైన ఫార్మాట్‌ను కూడా రూపొందించి అన్ని ప్రభుత్వ శాఖలకు పంపడంతో ఆ వివారాలను సేకరించి సీల్డ్‌ కవర్‌లో సీఎస్‌కు అందించింది. దీంతో జిల్లా కలెక్టరేట్లలో, ఇతర ప్రభుత్వ శాఖల్లో ఉన్నతాధికారులు వివిధ హోదాల్లో ఇప్పటికీ కొలువుల్లో కొనసాగుతున్న రిటైర్డ్‌ ఉద్యోగుల గుండెల్లో గుబులు రేగుతోంది.


గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం.. అనేక మంది ఉద్యోగులను రిటైర్డ్‌ అయిన తరువాత కూడా వారి స్థానాల్లోనే కొనసాగించేలా.. ఉద్యోగగడువు పొడిగిస్తూ పెద్ద ఎత్తున నియామకాలు జరిపింది. సాంకేతికపరమైన విధులతో కూడిన విద్యుత్‌, నీటిపారుదల, రోడ్లుభవనాల శాఖల్లో ఇలాంటి నియామకాలు విచ్చలవిడిగా జరిగాయి. ఒక్కో రిటైర్డ్‌ ఉద్యోగి ఏడు నుంచి ఎనిమిదేళ్లుగా కొనసాగుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యోగ విరమణ వయోపరిమితిని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం.. 58 యేళ్ల నుంచి 61 యేళ్లకు పెంచడంతో ప్రతీ ప్రభుత్వ ఉద్యోగి అదనంగా మూడేళ్లపాటు ఉద్యోగంలో కొనసాగే అవకాశం లభించింది. కింది స్థాయి ఉద్యోగులకు రావాల్సిన పదోన్నతులు రాలేదు. కొత్తగా ఉద్యోగాల కల్పనకు సైతం బ్రేక్ పడింది. ఇది చాలదన్నట్టు రిటైర్డ్‌ ఉద్యోగుల కొనసాగింపును విచ్చలవిడిగా సాగించింది గత ప్రభుత్వం. నీటిపారుదల, విద్యుత్‌రంగాల్లో సాంకేతిక అనుభవం పేరుతో ఉద్యోగ విరమణ చేసినా.. ఎక్స్‌టెన్షన్‌ ఇస్తూ అదే స్థానంలో కొనసాగించింది. మరికొన్ని కీలక శాఖల్లో కూడా పదవి విరమణ పొందిన ఉద్యోగుల కొనసాగింపు ఇదే విధంగా కొనసాగింది.

గత ప్రభుత్వంలో చాలా డిపార్టుమెంట్లలో రిటైర్డ్‌ ఉద్యోగులు రీఅపాయింట్‌మెంట్‌ పేరుతో కొనసాగుతున్నారని ఎన్నికల సమయంలో ఆరోపించింది కాంగ్రెస్‌. అలాంటి వారందరినీ అధికారంలోకి వచ్చిన తర్వాత విధుల నుంచి తొలగిస్తామన్నారు. చెప్పిన మాట ప్రకారం.. ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోనే..వారి వివరాలు సేకరించడంపై దృష్టి పెట్టింది రేవంత్‌ సర్కార్‌. అయితే చాలా కాలంగా సచివాలయంలో తిష్ఠ వేసిన రిటైర్డ్‌ ఉద్యోగులపై మొదటగా వేటు పడనున్నది.


రిటైర్‌ అయిన ఉద్యోగులు అనేక మంది.. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌, ఎక్స్‌టెన్షన్‌ పద్ధతిలో తిష్ఠవేయడంతో కిందిస్థాయి ఉద్యోగులకు అన్యాయం జరగడంతో పాటు కొత్త నియామకాలు కూడా చేపట్టకపోవడం యువత తీవ్రంగా నష్టపోయింది. రిటైర్డ్‌ ఉద్యోగులను గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏళ్ల తరబడి ఇష్టారాజ్యంగా కొనసాగించింది. దీంతో కొత్త నియామకాలు లేవు.. నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదు. కిందిస్థాయి ఉద్యోగులకు పదోన్నతులు రాలేదు. కీలకమైన శాఖల్లో ఏళ్లతరబడి రిటైర్డ్‌ ఉద్యోగులు పాతుకుపోవడంతో రెగ్యులర్‌ ఉద్యోగులకు ఉండే బాధ్యత, జవాబుదారీతనం లేకపోవడంతో.. అవినీతి కూడా విచ్చలవిడిగా పెరిగింది.

Tags

Related News

Weather News: కొన్ని గంటల్లో ఈ ఏరియాల్లో భారీ వర్షం.. ఇక రాత్రంతా దంచుడే

Nagarjunasagar flood: నాగార్జునసాగర్‌ గేట్లు ఎత్తివేత.. సందర్శకులకు బిగ్ అలర్ట్!

Hyderabad Rains: అమీర్‌పేట ముంపు ప్రాంతాల్లో సీఎం రేవంత్ పర్యటన.. అధికారులకు కీలక ఆదేశాలు

Malreddy Ranga Reddy: రంగారెడ్డి ఎమ్మెల్యే మల్‌రెడ్డి కుటుంబంలో రాఖీ పండుగ రోజే విషాదం

Rain News: భారీ వర్షం.. ఈ జిల్లాల్లో కుండపోత వాన.. ఇళ్ల నుంచి బయటకు రావొద్దు

Guvvala Balaraju: బీజేపీలో చేరిన గువ్వల.. కేటీఆర్‌పై హాట్ కామెంట్స్..

Big Stories

×