E-Paper
Advertisement

Kishan Reddy : ‘అయోధ్య రామయ్యకు విరాళం హర్షణీయం..’ హనుమాన్ హీరోను అభినందించిన కేంద్ర మంత్రి..

Kishan Reddy : ‘అయోధ్య రామయ్యకు విరాళం హర్షణీయం..’  హనుమాన్ హీరోను అభినందించిన కేంద్ర మంత్రి..
Advertisement
Cinema news in telugu

Kishan Reddy meets Teja Sajja(Cinema news in telugu):

ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన సినిమా హనుమాన్. యువ హీరో తేజ సజ్జా నటించిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద సూపర్ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన హనుమాన్ మూవీ హిట్ టాక్ సంపాదించుకుంది. ఏమాత్రం అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందు‌కు వచ్చి భారీ హిట్‌ను సొంతం చేసుకుంది. పలువురు సీనీ ప్రముఖులు, రాజకీయ నయకులు ఈ చిత్రాన్ని ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

తాజాగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హనుమాన్ హీరో తేజ సజ్జాని కలిశారు. న్యూఢిల్లీలోని అయన నివాసంలో కలిసిన తేజ సజ్జాను కిషన్ రెడ్డి అభినందించారు. దేశ వ్యాప్తంగా సెన్సేషన్ సృష్టించిన ఈ చిత్రం సూపర్ హిట్ కావడం సంతోషంగా ఉందని కిషన్ రెడ్డి అన్నారు.

Advertisement

‘హనుమాన్’ సినిమాలో తన పాత్రకు గుర్తింపు తెచ్చుకున్న యువ, ప్రతిభావంతుడైన నటుడు తేజ సజ్జాను కలుసుకున్న విషయాన్ని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తన X (ట్విటర్) వేదికగా పంచుకున్నారు.

“అయోధ్యలోని భగవాన్ శ్రీ రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమ సందర్బంగా.. భవ్య రామ మందిరానికి ప్రతి టిక్కెట్టు నుంచి 5.రూ విరాళంగా ఇవ్వడం అభినందించదగ్గ విషయం” అని కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు.

Advertisement

.

.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×