E-Paper
Advertisement

Telangana Government : రిటైర్డ్ ఉద్యోగులపై సీఎం రేవంత్ సర్కార్ ఫోకస్.. వివరాలు ఇవ్వాలని సీఎస్ ఆదేశం..

Telangana Government : రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా పలు హోదాల్లో కొనసాగుతున్న వారిపై రేవంత్ సర్కార్ దృష్టి పెట్టింది. అలాంటి వారి వివరాలు ఇవ్వాలని సీఎస్ శాంతికుమారి బుధవారం అన్ని శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇవాళ సాయంత్రంలోగానే ఇవ్వాలని స్పష్టం చేశారు.

Telangana Government : రిటైర్డ్ ఉద్యోగులపై సీఎం రేవంత్ సర్కార్ ఫోకస్.. వివరాలు ఇవ్వాలని సీఎస్ ఆదేశం..
Advertisement

Telangana Government : రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా పలు హోదాల్లో కొనసాగుతున్న వారిపై రేవంత్ సర్కార్ దృష్టి పెట్టింది. అలాంటి వారి వివరాలు ఇవ్వాలని సీఎస్ శాంతికుమారి బుధవారం అన్ని శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇవాళ సాయంత్రంలోగానే ఇవ్వాలని స్పష్టం చేశారు.

కీలకశాఖల్లో కీలక స్థానాల్లో రిటైరైన అధికారులు కొనసాగుతున్నారు. ఆయా శాఖలను వారే శాసిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి వారి పేర్లను ప్రస్తావించారు. అలాంటి వారిని తొలగిస్తామని చెప్పారు. చెప్పినట్టుగానే సర్కార్ వారిపై దృష్టి పెట్టింది.

Advertisement

నీటిపారుదల, రోడ్లు-భవనాలు శాఖలతో పాటు.. జెన్‌కో, ట్రాన్స్‌కో, డిస్కంలలో ఉన్నత స్థానాల్లో రిటైరైన అధికారులే ఎక్కువగా ఉన్నారు. నీటిపారుదల శాఖలో కీలక ప్రాజెక్టులన్నీ పదవీ విరమణ చేసిన ఉద్యోగుల చేతుల్లోనే ఉన్నాయి. ఈ శాఖలో 13 మంది రిటైర్డ్ అధికారులు ఉన్నారు. ఇక రోడ్లు-భవనాల శాఖలో పదిమందికి పైగా పదవీ విరమణ పొందిన వారు ఉన్నట్టు తెలుస్తోంది.

విద్యుత్తు శాఖలో అధిక సంఖ్యలో డైరెక్టర్లుగా కీలక స్థానాల్లో ఉన్నారు. జెన్‌కోలో ఇద్దరు, ట్రాన్స్‌కోలో నలుగురు, డిస్కంలలో ఆరుగురు రిటైర్డ్ అధికారులే. వీరితో పాటు.. తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్‌ బ్యాంక్‌ ఎండీ, జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అధికారుల్లో కూడా చాలామంది పదవీ విరమణ పొందిన వాళ్లే ఉన్నారు. వీరిందరిని తొలగించి కొత్తవారికి అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.

Advertisement

Related News

పిల్లలకు పుట్టినరోజు బహుమతులు ఇవ్వడమే కాదు.. జీవితాంతం గుర్తుండిపోయేలా ఈ 7 అలవాట్లు నేర్పండి

Karthika Deepam 2 Serial Today Episode October 14th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న ఏమైనట్టు.. ? మాలిని జైలుకు వెళ్తుందా..?            

సోని నుంచి మరో అద్భుతం..Sony WF-C510 ఇయర్ బడ్స్ లాంచ్

హైడ్రా రంగంలోకి వస్తోంది.. ప్రకటనలు ఇచ్చేముందు ఈ రూల్స్ తెలియాలోచ్!

రూమ్ ఏదైనా సరే..ఈ టాప్-7 ప్రొజెక్టర్లతో విజువల్స్ నెక్స్ట్ లెవెల్!

Ninnu kori Serial Today Episode October 6th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ కు నిజం తెలుస్తుందా..? జీవన్ పరిస్థితి ఏంటి..?  

అంగవైకల్యంతోనే పుట్టాను…6 ఏళ్ళకే చనిపోతానని చెప్పారు, కానీ

Illu Illalu Pillalu Serial Today Episode October 2nd ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్‌: నర్మదను మెచ్చుకున్న రామరాజు – శ్రీవల్లి ప్లాన్ సక్సెస్ అయ్యేనా..?             

Big Stories

Advertisement
×