TG Govt: తెలంగాణ ప్రభుత్వం అవుట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులకు గుడ్ న్యూస్ చెప్పింది. 1,037 మంది అవుట్‌సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శుల సర్వీస్ మరో ఏడాది పొడిగించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. కాంట్రాక్ట్/అవుట్ సోర్సింగ్ నియామకానికి సంబంధించిన పద్ధతులను అనుసరించాలని నెలకు రూ.19,500 చెల్లించాలని ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాల్లో పంచాయతీ సెక్రటరీల సంఖ్య గ్రామ పంచాయతీల సంఖ్యను మించకుండా చూసుకోవాలని ఆదేశించారు.
గత ప్రభుత్వ హయాంలో విడుదలైన జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామక ప్రక్రియలో భాగంగా స్పోర్ట్స్ కోటాలో 172 పోస్టుల భర్తీ అనుమతిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. గత ఐదేళ్లుగా పెండింగ్ లో ఉన్న నియామకాలు ప్రభుత్వం భర్తీ చేస్తుండడంతో క్రీడాకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత పంచాయతీరాజ్ లో 9 వేలకు పైగా జేపీఎస్ నియామకాలు చేపట్టింది ప్రభుత్వం. ఈ పోస్టులకు 4 ఏళ్ల వరకు ప్రొబేషన్ విధించారు. ఈ సమయంలో ఉద్యోగుల పనితీరు, హాజరు, ప్రభుత్వ ఆదేశాల ఆధారంగా వారి ఉద్యోగాలు రెగ్యులరైజ్ చేశారు.
Also Read: Fee Reimbursement: ఫీజు రియింబర్స్‌మెంట్ విధానంపై రేవంత్ సర్కాట్ కమిటీ ఏర్పాటు
దీంతో చాలా మంది జేపీఎస్‌లు ప్రొబేషన్ పూర్తి చేసుకుని రెగ్యులర్ ఉద్యోగులుగా మారారు. అయితే వివిధ కారణాల వల్ల మరికొంతమంది ఇంకా క్రమబద్ధీకరణ కాలేదు. జేపీఎస్‌లలో మెరుగైన ఉద్యోగాలు సాధించిన వారు వేరే పోస్టులకు వెళ్లడంతో, ఆయా పోస్టులు ఖాళీ అయ్యాయి. దీంతో కొన్ని పోస్టులను ఔట్‌సోర్సింగ్ విభాగంలో భర్తీ చేస్తున్నారు.