Weather News: రెండు తెలుగు రాష్ట్రాల్లో గత పది రోజులుగా భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. ముఖ్యంగా మొంథా తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో సైక్లోన్ ప్రభావం కారణంగా వేల కోట్ల నష్టం వాటిల్లింది. లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. తెలంగాణలో వరంగల్, హన్మకొండ, నల్గొండ, మహబూబాబాద్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో భారీ నష్టం జరిగింది. ఏపీలో ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు దంచికొట్టాయి. వరంగల్, హన్మకొండ నగరాలు వరదలతో మునిగిపోయాయి. అప్పులు చేసి పంట పండించి.. కరెక్ట్ పంట చేతికి వచ్చే సమయానికే తుఫాన్ బీభత్సం సృష్టించండంతో లక్షల ఎకరాల్లో పంట దెబ్బతింది. దీంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నాగర్‌కర్నూల్‌లో దంచికొడుతున్న వర్షం..
కాసేపటి క్రితమే నాగర్ కర్నూల్, వనపర్తి, మహబూబ్ నగర్ జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షం దంచికొట్టింది. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని హౌజింగ్ బోర్డు కాలనీలో కుండపోత వర్షం కొట్టింది. వర్షం ధాటికి కాలనీలు వాగులను తలపిస్తున్నాయి. భారీ వర్షానికి స్థానిక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. అయితే హైదరాబాద్ వాతావరణ శాఖ మరోసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలను అలర్ట్ చేసింది.
కాసేపట్లో ఈ జిల్లాల్లో వర్షం
మరికొన్ని గంటల్లో వికారాబాద్, రంగారెడ్డి, నల్లగొండ, నాగర్ కర్నూల్, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మహబూబ్ నగర్, నారాయణపేట, వనపర్తి, గద్వాల, నాగర్ కర్నూల్ జిల్లా్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగులు పడే అవకాశం ఉందని వివరించారు. భారీ వర్షాల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని.. అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.
హైదరాబాద్‌లో ఈ ప్రాంతాల్లో వర్షం
హైదరాబాద్ లో మరి కాసేపట్లో పలు ప్రాంతాల్లో బారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మల్కాజిగిరి, ఉప్పల్, కాప్రా, ఓయూ, నాచారం, తార్నాక, సికింద్రాబాద్, రామంతాపూర్, ఎల్‌బీ నగర్, సరూర్‌నగర్, వనస్థలిపురం, చార్మినార్, నాంపల్లి, రాజేంద్రనగర్ ప్రాంతాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని అధికారులు పేర్కొన్నారు. అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం ఉందని కూడా హెచ్చరించారు.
భారీ వర్షాలతో జాగ్రత్త..
తెలంగాణలో మిగిలిన జిల్లాల్లో పెద్దగా వర్షాల ప్రభావం ఏమీ లేదని అధికారులు చెబుతున్నారు. అక్కడక్కడ మోస్తారు వర్షాలు పడే ఛాన్స్ ఉందని అన్నారు. ఏదేశమైనప్పటికీ భారీ వర్షాల పట్ల తెలుగు రాష్ట్రాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. భారీ వర్షాలు ఉన్న జిల్లాల ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని చెబుతున్నారు.
ALSO READ: Hydra Demolitions: మేడ్చల్‌లో హైడ్రా కూల్చివేతలు.. రియల్ ఎస్టేట్ వెంచర్‌లో..