Patancheru Tragedy: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం పెద్దకంజర్లలో వినాయక నిమజ్జనం తీవ్ర శోకాన్ని మిగిల్చింది. స్థానిక నేరేడు చెరువులో గణనాథుని విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు వెళ్లి ఆరుగురు చిన్నారులు నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఎంతో ఉత్సాహంగా, కోలాహలంగా సాగాల్సిన పండుగ వేడుకలు నిమిషాల వ్యవధిలో విషాదాంతంగా మారి, స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసాయి.
మృతి చెందిన చిన్నారులంతా స్థానిక ఛారిటబుల్ ట్రస్టుకు చెందిన అనాథ శరణాలయంలో ఉంటూ చదువుకుంటున్నట్లు తెలిసింది. పండుగ సంబరాల్లో భాగంగా విగ్రహాన్ని నిమజ్జనం చేయడానికి వెళ్లిన సమయంలో ఈ అభాగ్యులు ప్రమాదవశాత్తు చెరువులోని లోతైన ప్రాంతంలోకి వెళ్లి మునిగిపోయారని సమాచారం.
సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, స్థానిక ఈతగాళ్లు , రెస్క్యూ బృందాలు గాలింపు చర్యలు చేపట్టి ఆరుగురి మృతదేహాలను వెలికితీశారు. పండుగ రోజున తల్లిదండ్రులు లేని పిల్లలు ఇలా ఒకేసారి ప్రాణాలు కోల్పోవడంతో ఆ ప్రాంతమంతా శోకసంద్రంలో మునిగిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: జగిత్యాల జిల్లాలో దారుణం.. భార్యను చున్నీతో ఉరివేసి చంపిన భర్త!