E-Paper
Advertisement

Medchal district : తల్లిదండ్రులకు దూరంగా ఉండలేక.. ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య..

Medchal district : మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం నెలకొంది. పీర్జాదిగూడ శ్రీ చైతన్య జూనియర్ కళాశాల మహిళ బ్రాంచ్‌లో ఇంటర్ మొదటి సంవత్సరం బైపీసీ చదువుతున్న వర్ష అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. బాత్‌రూమ్‌లో చున్నీతో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఉరి వేసుకున్న విషయాన్ని తోటి విద్యార్థులు కళాశాల సిబ్బందికి చెప్పగా. వారు స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆ యువతి మరణించిదని వైద్యులు ధ్రువీకరించారు. ఘటన స్థలానికి చేరుకున్న మేడిపల్లి పోలీసులు పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.

Medchal district :  తల్లిదండ్రులకు దూరంగా ఉండలేక.. ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య..
Advertisement
Medchal district

Medchal district : మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం నెలకొంది. పీర్జాదిగూడ శ్రీచైతన్య జూనియర్ కళాశాల మహిళ బ్రాంచ్‌లో ఇంటర్ మొదటి సంవత్సరం బైపీసీ చదువుతున్న వర్ష అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. బాత్‌రూమ్‌లో చున్నీతో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.

ఉరి వేసుకున్న విషయాన్ని తోటి విద్యార్థులు కళాశాల సిబ్బందికి చెప్పారు. వారు స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆ యువతి మరణించిదని వైద్యులు ధ్రువీకరించారు. ఆస్పత్రికి చేరుకున్న మేడిపల్లి పోలీసులు వర్ష మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.

Advertisement

వర్ష ఆత్మహత్య చేసుకుందా లేదా మరేదైనా జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలు స్వస్థలం వనపర్తి జిల్లా వీపన్నగండ్ల గ్రామమని పోలీసులు వెల్లడించారు. తల్లిదండ్రులకు దూరంగా ఉండి చదువుకోవటం ఇష్టం లేక విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు దర్యాప్తులో వెల్లడైంది.

కళాశాల యాజమాన్యం వర్ష డెడ్ బాడీని గుట్టుచప్పుడు కాకుండా గాంధీ ఆసుపత్రికి తరలించారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థిని కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

Tags

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×