Tips for Career : అత్తారింటికి దారేది.. సినిమాలో చెప్పినట్లుగా ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో కూడా తెలిసినవాడే గొప్పోడంటారు. కెరీర్‌లో ఉన్నత స్థాయికి ఎదగాలంటే.. పనితనం, మంచి వ్యక్తిత్వం కలిగి ఉండటంతో పాటు.. కెరీర్‌ను నాశనం చేసే కొన్ని లక్షణాలు కూడా మనలో ఉండకూడదు. ఆ లక్షణాలేంటే..?
ఆఫీస్‌కు టైంకు రాకపోడం, ముందస్తు సమాచారం లేకుండా సెలవులు పెట్టడం.. వంటివి మీపై మర్యాద, నమ్మకాన్ని పోగొడతాయి.
పని వేళల్లో ఎక్కువగా సోషల్ మీడియాలో కనిపిస్తే.. ఇతరులు మీరు పని చేయడం లేదని భావించవచ్చు.
అంతా నాకే తెలుసని అహంతో పనిచేయడం అంత మంచిది కాదు.
ఆఫీస్ కొలీగ్స్ గురించి ఇతరులు చెప్పే మాటలను అంతగా పట్టించుకోకపోవడం మంచిది. వాటితో మనస్పర్ధలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
మీ కంటే తక్కువ అనుభవం ఉన్నవారిని, లేదా జూనియర్స్‌ను చులకనగా చూడటం సరికాదు.