E-Paper
Advertisement

Vemulawada : వికాస్ రావుకే వేములవాడ టిక్కెట్.. తుల ఉమకు షాక్..

Vemulawada :  వికాస్ రావుకే వేములవాడ టిక్కెట్.. తుల ఉమకు షాక్..
Advertisement

Vemulawada : తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ అనూహ్య నిర్ణయాలు తీసుకుంటోంది. ఆఖరి క్షణాల్లో అభ్యర్థులను మార్చేసింది. వేములవాడ టిక్కెట్ విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది. చెన్నమనేని వికాస్‌ రావు కు చివరిలో క్షణంలో టిక్కెట్ ఇచ్చింది. తొలుత తుల ఉమను అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది. చివరి నిమిషంలో వేములవాడ అభ్యర్థిని మార్చేసింది. తుల ఉమని పక్కనపెట్టి వికాస్‌రావుకు బీఫామ్‌ ఇచ్చింది.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు జెడ్పీ ఛైర్ పర్సన్ గా చేసిన తుల ఉమ.. ఈటల రాజేందర్ తోపాటు బీజేపీలో చేరారు. ఈటల గులాబీ గూటి నుంచి బయటకు వచ్చిన సమయంలో ఆయనకు అండగా నిలిచారు. హుజురాబాద్ ఉపఎన్నికలో ఈటల విజయం కోసం ఎంతో కృషి చేశారు. ఈ నేపథ్యంలోనే ఆమెకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇప్పించేందుకు ఈటల ఎన్నో ప్రయత్నాలు చేశారు. చివరికి బీజేపీ అధిష్టానాన్ని ఒప్పించి వేములవాడ టిక్కెట్ ఇప్పించుకోగలిగారు. కానీ చివరి నిమిషంలో ఈటలకు అధిష్టానం షాకిచ్చింది.

Advertisement

వేములవాడ టిక్కెట్ ను బీజేపీ సీనియర్ నేత చెన్నమనేని విద్యాసాగర్ రావు తనయుడు వికాస్ రావు ఆశించారు. ఆయనకు బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా మద్దతుగా నిలిచారు. తొలుత టిక్కెట్ తుల ఉమకు ఇవ్వడంతో వికాస్ రావు వర్గం ఆందోళన వ్యక్తం చేసింది. హైదరాబాద్ బీజేపీ కార్యాలయం వద్ద కూడా వికాస్ రావు అనుచరులు ఆందోళన చేశారు. ఆయనకే టిక్కెట్ ఇవ్వాలని పట్టుబట్టారు. కార్యకర్తల మద్దతు ఎక్కువగా వికాస్ రావుకే ఉండటంతో బీజేపీ అధిష్టానం చివరి నిమిషంలో తలొగ్గింది. వికాస్ రావుకే వేములవాడ బీ ఫామ్ ఇచ్చింది.

అటు సంగారెడ్డిలోనూ చివరి నిమిషంలో అభ్యర్థిని మార్చేసింది కాషాయ పార్టీ. సంగారెడ్డి అభ్యర్థిగా పులిమామిడి రాజు పేరు ప్రకటించింది. తొలుత ఇక్కడ టిక్కెట్ దేశ్‌పాండేకు ఇచ్చింది. అయితే ఆయనను పక్కనపెట్టి పులిమామిడి రాజుకు బీఫామ్‌ ఇచ్చింది. దీంతో సంగారెడ్డిలో దేశ్‌పాండేకు బదులుగా పులిమామిడి రాజు బరిలోకి దిగారు.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×