E-Paper
Advertisement

Telangana phone tapping case: నిందితులకు నో బెయిల్, ఎన్నికల్లో మనీ సీజ్‌పై అధికారుల దృష్టి

Telangana phone tapping case: నిందితులకు నో బెయిల్, ఎన్నికల్లో మనీ సీజ్‌పై అధికారుల దృష్టి
Advertisement

Telangana phone tapping case(Today news in telangana): తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి రానున్నాయి. ఈ కేసులో నిందితులు భుజంగరావు, తిరుపతన్నల బెయిల్ పిటిషన్లను నాంపల్లి కోర్టు బుధవారం తోసిపుచ్చింది. ఈ కేసు ఇంకా దర్యాప్తు జరుగుతోందని, ఈ సమయంలో బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని పోలీసులు న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. దీంతో నిందితుల బెయిల్ పిటిషన్లను న్యాయస్థానం కొట్టి వేసింది.

ఇదిలావుండగా ఎన్నికల సమయంలో ఫోన్ ట్యాపింగ్ ద్వారా పెద్ద ఎత్తున మనీ సీజ్ చేసింది రాధాకిషన్‌రావు టీమ్. సీజ్ చేసిన సొమ్ము ఎంత? అందులో నొక్కేసినదెంత? అనేదానిపై దర్యాప్తు అధికారులు ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. ఎన్నికల్లో డబ్బు పంపిణీపై తాము ఫోకస్ చేశామని నిందితులు విచారణలో అంగీకరించారు. దీంతో ఆ కోణంలో లోతుగా దర్యాప్తు చేయనున్నారు.

Advertisement

ఎన్నికల సమయంలో ఫోన్ ట్యాపింగ్ ద్వారా ప్రతిపక్షాలకు చెందిన వాహనాలపై కన్నేసింది ఆ టీమ్. డబ్బు రవాణా విషయం తెలియగానే అప్పటి హైదరాబాద్ టాస్క్‌‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్‌రావుకు సమాచారం ఇచ్చేవారు. దీని ఆధారంగా సోదాలు నిర్వహంచేవారు. ఈ తతంగమంతా చాలా పకడ్బందీగా సాగేది. అయితే కొన్ని సందర్భాల్లో దొరికిన డబ్బులో కొంత కాజేసి, మిగతాది లెక్కల్లో చూపించారని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు.

ALSO READ: జీవో 317 పై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ భేటీలో కీలక నిర్ణయాలు

Advertisement

చట్ట విరుద్ధంగా మనీ రవాణా చేయడం నేరం. అందులోనూ అప్పటి డీసీపీ టీమ్ ఎంత చెబితే అంతే పట్టు బడినట్టు సంతకాలు చేసేశారట అధికారులు. ఇప్పుడు దీనిపైనే అధికారులు దృష్టి సారించినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో డబ్బు రవాణా చేస్తూ పట్టుబడినవారిని పిలిచి విచారించాలని భావిస్తోంది సిట్. మొత్తానికి రాధా లీలలు ఇంకెన్ని బయటపడతాయో చూడాలి.

Tags

Related News

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

మేడ్చల్‌లో పార్కింగ్ రగడ కలకలం.. హెచ్చరికలు జారీ చేసిన సీఐ క్రాంతి కుమార్!

తెలంగాణలో కొత్త పింఛన్‌‌దారులకు బిగ్ రిలీఫ్.. ఆ విషయంపై క్లారిటీ!

కాంగ్రెస్‌కు కొండా‌ గుడ్‌బై? త్వరలో భారీ అప్‌డేట్ అంటూ పోస్ట్, వాస్తవం ఏమిటంటే?

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

Big Stories

Advertisement
×