BigTV English

Telangana Politics : సీఎంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల భేటీ.. కథ స్క్రీన్‌ప్లే దర్శకత్వం.. హరీశ్ రావు..?

Telangana Politics : బీఆర్ఎస్ కు వరుస షాక్ లు తగులుతున్నాయి. కేసీఆర్ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ఎమ్మెల్యేలు తిరగబడుతున్నారు. ప్రజా పాలన అందిస్తున్న కాంగ్రెస్ పార్టీ వైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చూస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వరుసగా కలుస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరడానికి మొగ్గు చూపుతున్నారు. కాంగ్రెస్ ప్రజా పాలనకు ఆకర్షితులవుతున్నారు.

Telangana Politics : సీఎంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల భేటీ.. కథ స్క్రీన్‌ప్లే దర్శకత్వం.. హరీశ్ రావు..?
Telangana Politics

Telangana Politics : బీఆర్ఎస్ కు వరుస షాక్ లు తగులుతున్నాయి. కేసీఆర్ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ఎమ్మెల్యేలు తిరగబడుతున్నారు. ప్రజా పాలన అందిస్తున్న కాంగ్రెస్ పార్టీ వైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చూస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వరుసగా కలుస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరడానికి మొగ్గు చూపుతున్నారు. కాంగ్రెస్ ప్రజా పాలనకు ఆకర్షితులవుతున్నారు.


తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల వేళ రాజకీయంగా రసవత్తరంగా మారుతోంది. రాష్ట్రంలో పొలిటికల్‌ సమీకరణాలు మారుతున్నాయి. సీఎం రేవంత్‌ రెడ్డిని కలిసేందుకు బీఆర్‌ఎస్‌ నేతలు క్యూ కడుతున్నారు. దీంతో, రాజకీయంగా చర్చ మొదలైంది.

తాజాగా రంగారెడ్డి జిల్లా పాలిటిక్స్‌ హాట్‌ టాపిక్‌గా మారాయి. ఆదివారం సీఎం రేవంత్‌ రెడ్డిని రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాష్‌ గౌడ్‌ కలిశారు. ఈ క్రమంలో ప్రకాష్‌ గౌడ్‌కు ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌ రెడ్డి కాంగ్రెస్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇక, సీఎం రేవంత్‌ రెడ్డితో ప్రకాష్‌ గౌడ్ దాదాపు గంట పాటు చర్చించారు. దీంతో, రాష్ట్రంలో రాజకీయం మరోసారి హీటెక్కింది.


ఇదిలా ఉండగా.. శనివారం సీఎం రేవంత్‌ రెడ్డిని మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కలిశారు. మరికొంత మంది ఎమ్మెల్యేలు కూడా సీఎం రేవంత్‌తో టచ్‌లో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇక, ఇటీవలే మెదక్‌ జిల్లాకు చెందిన నలుగురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కూడా సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. వీరి భేటీపై పెద్ద చర్చ జరగడంతో.. ఆ నలుగురు ఎమ్మెల్యేలు ప్రెస్‌మీట్‌ పెట్టి కీలక వ్యాఖ్యలు చేశారు. తాము కేవలం అభివృద్ధిపై చర్చించేందుకే సీఎం రేవంత్‌ను కలిసినట్టు క్లారిటీ ఇచ్చారు.

అయితే, బీఆర్‌ఎస్‌ నేతలు వరుస పెట్టి సీఎం రేవంత్‌ రెడ్డిని కలుస్తున్న నేపథ్యంలో రాబోయే లోక్‌సభ ఎన్నికలకు ప్రాధాన్యత సంతరించుకుంది. లోక్‌సభ ఎన్నికల నాటికి రాష్ట్రంలో మరిన్ని వలసలు ఉండవచ్చనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. మరోవైపు.. తాజాగా కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మధు యాష్కీ గౌడ్ ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. అనేక మంది విపక్ష ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు బీఆర్‌ఎస్‌ను టెన్షన్‌ పెడుతున్నట్టు సమాచారం.

మెదక్‌ జిల్లాకు చెందిన నలుగురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలవడంతో హరీష్ రావుపై కూడా కేసీఆర్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హరీశ్‌రావు పాత్రపైనా కేసీఆర్ ఆరా తీస్తున్నారు. హరీశ్‌రావుకు తెలియకుండానే నేతలు వెళ్లి సీఎంను కలిశారా..? లేక హరీశ్‌రావు డైరెక్షన్‌ లోనే ఈ మీటింగ్ కి ప్లాన్ చేశారా..? అనే అనుమానాలు బీఆర్ఎస్ లో వినిపిస్తున్నాయి.

మెదక్‌ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి, కొత్తప్రభాకర్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, మాణిక్‌రావు సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన వారిలో ఉన్నారు. ఈ భేటీకి సంబంధించి కొత్త ప్రభాకర్‌ అపాయింట్‌మెంట్‌ తీసుకోగా…. మెదక్‌ జిల్లాకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు కలిసి వెళ్లి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారంటూ కాంగ్రెస్ మంత్రులు గత కొద్ది రోజులుగా చెబుతూ వస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత సుమారు 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రీసెంట్ గానే వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేలు భేటీ కావడం గులాబీ నేతల్లో గుబులు పుట్టిస్తోంది.

కేసీఆర్ గీసిన గీత దాటని ఎమ్మెల్యేలు ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డిని వరుసగా కలవడం హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటి వరకు కేసీఆర్ నిరంకుశత్వాన్ని బరించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇక సహించేది లేదంటూ బహిరంగంగానే చర్చిస్తున్నారు. రాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్ పార్టీని తిరస్కరించి, కేసీఆర్ ను ఫాం హౌస్‌కు పరిమితం చేశారు. ఇక ఎమ్మెల్యేలు కేసీఆర్ చర నుంచి ఒక్కొక్కరిగా బయటపడుతున్నారు.

Related News

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Nellore Politics: అనిల్ దెబ్బకు వేమిరెడ్డి వెనక్కి తగ్గాడా?

AP BJP: ఏపీలో బీజేపీకి అన్యాయం జరుగుతుందా?

Big Stories

×