E-Paper
Advertisement

Training Program: రాష్ట్రంలో నూతన సర్పంచులు, వార్డు సభ్యులకు శిక్షణ తరగతులు

Training Program: రాష్ట్రంలో నూతన సర్పంచులు, వార్డు సభ్యులకు శిక్షణ తరగతులు
Advertisement

Training Program: సర్పంచులు, వార్డు మెంబర్లకు పంచాయతీరాజ్​ చట్టంపై అవగాహన కల్పించేందుకు శిక్షణ తరగతులు నిర్వహించనున్నది. మార్చి 31లోగా కంప్లీట్ చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అందులో భాగంగా ట్రైనింగ్ ఇచ్చే అధికారులకు (ట్రైనర్స్) ముందుగా రాజేంద్రనగర్‌లోని టీజీఐఆర్‌డీలో తరగతులు నిర్వహిస్తున్నారు. పంచాయతీరాజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ ఎంవీ శైలేష్ హాజరై దిశానిర్దేశం చేశారు. 2018 పంచాయతీరాజ్ చట్టంపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలన్నారు. గ్రామాల్లో పాలన పారదర్శకంగా సాగాలన్నా, నిధుల వినియోగం సక్రమంగా ఉండాలన్నా చట్టంలోని నిబంధనలు తెలియాలని, చట్టానికి లోబడి బాధ్యతలు నిర్వహించేలా సర్పంచులను, వార్డు సభ్యులను సన్నద్ధం చేసే బాధ్యత ట్రైనర్లదేనని సూచించారు.

Also Read: Municipal Elections: కాంగ్రెస్‌కు కీలకంగా మారిన ఆ రెండు జిల్లాల కార్పొరేషన్లు.. వాటిపై స్పెషల్ ఫోకస్..?

టీజీఐఆర్‌డీలో తరగతులు..

Advertisement

ప్రతి జిల్లా నుంచి నలుగురు జిల్లా, మండల స్థాయి అధికారులతోపాటు 25 మంది చొప్పున పంచాయతీ కార్యదర్శులను ఎంపిక చేసి శిక్షణ ఇస్తున్నామని, ఈ నెల 13వ తేదీలోగా ట్రైనింగ్ పూర్తి చేయడం జరుగుతుందన్నారు. ట్రైనర్లు రాష్ట్రంలోని 12,769 మంది సర్పంచులు, సుమారు 1.11 లక్షల మంది వార్డు మెంబర్లకు శిక్షణ ఇవ్వనున్నారు. మార్చి 31లోపు రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల పాలకవర్గాలకు జిల్లా కేంద్రాల్లో పూర్తిస్థాయిలో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. కార్యక్రమంలో సెంటర్ హెడ్ స్టివెన్ నీల్, జేడీ (ట్రైనింగ్) ప్రసూనా రాణి, యాదాద్రి భువనగిరి ఎంపీడీవో సీహెచ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Also Read: Amardeep: అమర్దీప్ కి రవితేజ స్పెషల్ గిఫ్ట్.. ఏంటంటే?

Related News

Amit Shah: అమిత్ షా కరీంనగర్ టూర్ సీక్రెట్స్ అన్నీ లీక్.. అసలు ప్లాన్ వేరే ఉందా..?

ఇన్‌స్టాగ్రామ్ లవ్ డ్రామా.. 14 ఏళ్ల చిన్నారిపై లైంగిక దాడి.. కోర్టు సంచలన తీర్పు!

SIR Process: ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఓట్లకు బీజేపీ ఎసరు?.. కుట్రను బైటపెట్టిన మాజీ డీసీసీ!

KTR: ఇది కాలం తెచ్చింది కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు..కేటీఆర్ షాకింగ్ కామెంట్స్!

కొట్టుకుపోయిన జాతీయ రహదారి.. తెలంగాణ- ఛత్తీస్‌గఢ్ రాకపోకలు బంద్!

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ ఆరోగ్యం మాటేంటి? షాకింగ్ విషయాలు, బిగ్ టీవీతో డాక్టర్ రవిశంకర్

హైదరాబాద్‌ వాసులకు అదిరిపోయే వార్త.. ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తులు ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే!

మీర్‌పేట్‌లో అర్ధరాత్రి దారుణం.. బర్త్‌డే వేడుకలకు పిలిచి రౌడీషీటర్ దారుణ హత్య

Big Stories

Advertisement
×