E-Paper
Advertisement

ఏఐ యుగంలో విప్లవాత్మక మార్పు.. షావోమి కొత్త ఫోన్ వెనుక ఆ ప్రత్యేకత ఏంటంటే?

ఏఐ యుగంలో విప్లవాత్మక మార్పు.. షావోమి కొత్త ఫోన్ వెనుక ఆ ప్రత్యేకత ఏంటంటే?
Advertisement

Xiaomi 18 Pro Max: షావోమి నుంచి రాబోతున్న కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ షావోమి 18 ప్రో మాక్స్ ఇప్పుడు టెక్ మార్కెట్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ హ్యాండ్ సెట్ లాంచ్‌కు ఇంకా సమయం ఉన్నప్పటికీ.. ఇప్పటికే కొన్ని కీలక వివరాలు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. తాజాగా గీక్‌బెంచ్‌లో కనిపించడంతో ఫోన్ పనితీరుకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి.

తాజాగా లీకైన సమాచారం ప్రకారం.. షావోమి 18 ప్రో మాక్స్‌లో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ Gen 6 ప్రో చిప్‌సెట్ ఉండే అవకాశం ఉంది. గీక్‌బెంచ్ టెస్టులో ఈ ఫోన్ సింగిల్ కోర్‌లో 3,381 పాయింట్లు, మల్టీ కోర్‌లో 10,920 పాయింట్లు సాధించినట్లు తెలుస్తోంది. ఈ స్కోర్లు నిజమైతే ఫోన్ పనితీరు చాలా పవర్‌ఫుల్‌గా ఉండొచ్చని చెప్పొచ్చు. ఇక సాఫ్ట్‌వేర్ పరంగా ఆండ్రాయిడ్ 17 ఆధారిత HyperOS 4తో వచ్చే అవకాశం ఉంది.

Advertisement

Also Read: స్మార్ట్‌ఫోన్ మీ చేతిలోనే ఉంది.. కానీ ఈ అమేజింగ్ సెట్టింగ్స్ ఇప్పటివరకు ఎందుకు ట్రై చేయలేదు?

ఈ ఫోన్‌లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న మరో ఫీచర్ వెనుకవైపు ఉండే సెకండరీ డిస్‌ప్లే. గతంలో ఇలాంటి బ్యాక్ స్క్రీన్‌లు ప్రధానంగా టైమ్, నోటిఫికేషన్లు వంటి వాటిని చూసేందుకు మాత్రమే ఉపయోగపడేవి. కానీ షావోమి 18 ప్రో మాక్స్‌లో ఈ స్క్రీన్‌ను మరింత ఉపయోగకరంగా మార్చే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. వాటర్ రిమైండర్లు పెట్టుకోవడం, ఇంగ్లీష్ పదాలు ప్రాక్టీస్ చేయడం వంటి చిన్న పనులకు కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చట.

Advertisement

ఇక స్టాండర్డ్ షావోమి 18 కూడా 6.4 అంగుళాల డిస్‌ప్లేతో కాంపాక్ట్ డిజైన్‌లో రానుందని రూమర్స్ వినిపిస్తున్నాయి. వైట్, పింక్, బ్లూ, రెడ్, బ్లాక్ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం. షావోమి 18 సిరీస్ ఈ నెలలోనే చైనాలో లాంచ్ కావచ్చని తెలుస్తోంది. అయితే భారత్‌లో లాంచ్ తేదీ, ధరపై మాత్రం ఇంకా అధికారిక సమాచారం లేదు. మరిన్ని వివరాలు లాంచ్‌కు దగ్గర్లో వెల్లడయ్యే అవకాశం ఉంది.

Also Read: Nothing Phone 3 ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం.. ఏకంగా రూ.27,000 తగ్గింపు!

Tags

Related News

Nothing Phone 3 ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం.. ఏకంగా రూ.27,000 తగ్గింపు!

కెమెరా అక్కర్లేదు, ఫోనే చాలు! మీ ఫస్ట్ వ్లాగ్ వైరల్ అవ్వాలంటే ఇవి మస్ట్

స్మార్ట్‌ఫోన్ మీ చేతిలోనే ఉంది.. కానీ ఈ అమేజింగ్ సెట్టింగ్స్ ఇప్పటివరకు ఎందుకు ట్రై చేయలేదు?

వర్షంలో తడిచినా పాడవ్వవు, రూ.20వేలలోపు టాప్-6 వాటర్‌ప్రూఫ్ ఫోన్లు!

రోజూ గిన్నెలు కడిగి విసుగొస్తుందా? ఒకేసారి 20 ప్లేట్ల సెట్ క్లీన్ చేసే కొత్త డిష్‌వాషర్ లాంచ్!

ఒక్కసారి ఛార్జ్ చేస్తే 45 రోజుల బ్యాటరీ బ్యాకప్..అదిరిపోయే ఫిట్‌నెస్ బ్యాండ్ లాంచ్!

జస్ట్ రూ.1,000కే బెస్ట్ ఇయర్ బడ్స్.. త్వరలో మార్కెట్లోకి రాబోతున్న టాప్ బ్రాండ్స్ ఇవే!

Big Stories

Advertisement
×