E-Paper
Advertisement

తెలంగాణ పర్యాటక శాఖ సంచలన నిర్ణయం.. ఆ పది జిల్లాలపై స్ఫెషల్ ఫోకస్!

తెలంగాణ పర్యాటక శాఖ సంచలన నిర్ణయం.. ఆ పది జిల్లాలపై స్ఫెషల్ ఫోకస్!
Advertisement

Telangana Tourism: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణ పర్యాటక రంగం కొత్త పుంతలు తొక్కబోతోంది. రాష్ట్రంలోని చారిత్రక, ఆధ్యాత్మిక, ప్రకృతి సంపదను ప్రపంచానికి పరిచయం చేస్తూనే, పర్యాటకులకు అంతర్జాతీయ స్థాయి వసతులు కల్పించేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. 10 జిల్లాలను ప్రాధాన్యతగా తీసుకుని, రూ.274.93 కోట్ల భారీ వ్యయంతో పర్యాటక సర్క్యూట్లను అభివృద్ధి చేసేందుకు పర్యాటక శాఖ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది. టెండర్లు సైతం ఆహ్వానించగా, కొన్నింటికి ఓకే అయినట్లు సమాచారం. త్వరలోనే పనులు సైతం ప్రారంభం కానున్నట్లు అధికారులు తెలిపారు. కేవలం సందర్శన మాత్రమే కాకుండా, పర్యాటకులకు అంతర్జాతీయ స్థాయి వసతులు కల్పించడమే లక్ష్యంగా ఈ నిధులు వెచ్చించనున్నారు.

పది జిల్లాలకు కేటాయింపులు ఇలా..

పది జిల్లాలకు రూ.274.93 కోట్లతో టూరిజం ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించింది. నల్లగొండ జిల్లాకు 30.50కోట్లు, మహబూబ్ నగర్ జిల్లాకు 72.38కోట్లు, ఆదిలాబాద్ జిల్లాకు 7.67కోట్లు, హైదరాబాద్ కు 1.10కోట్లు, కరీంనగర్ జిల్లాకు 16.20కోట్లు, ఖమ్మం జిల్లాకు 93.12కోట్లు, మెదక్ 10కోట్లు, నిజామాబాద్ జిల్లాకు 9.50కోట్లు, రంగారెడ్డి జిల్లాకు 18.96కోట్లు, వరంగల్ జిల్లాకు 15.50కోట్లతో ప్లాన్ రూపొందించారు. ఈ జిల్లాల్లో అభివృద్ధి పనులు పూర్తయితే టూరిజంకు పర్యాటకుల సంఖ్య భారీగా పెరగనుంది. ఆదాయం సైతం అదే స్థాయిలో రానుంది.

సర్క్యూట్ల వారీగా అభివృద్ధి

Advertisement

పర్యాటక శాఖ ఈ నిధులను కేవలం నిర్మాణాలకే పరిమితం చేయకుండా, థీమ్ ఆధారితంగా పనులను విభజించింది. అటు ఆధ్యాత్మికత, ఇటు ప్రకృతి అందాలను మేళవిస్తూ ప్రణాళికలు రూపొందించింది.ప్రత్యేక పర్యాటక ప్రాంతాలుగా విభజన చేసింది. ఆధ్యాత్మికం కింద 9 ఆలయాలు,వారసత్వం కింద7 జిల్లాలోని ఆలయాలు, ఎకో-వెల్నెస్ గా 8 , హస్తకళలు 3 ప్రాంతాలు,జల సర్క్యూట్లుగా4, బౌద్ద సర్య్యూట్లుగా 8 ప్రాంతాలుగా విభజన చేశారు.ఆధ్యాత్మికంకింద యాదగిరిగుట్ట, భద్రాచలం, బాసర, వేములవాడ, ఆలంపూర్ – సోమశిల, రామప్ప, కాళేశ్వరం, మెదక్, వారసత్వం కింద వరంగల్, నల్గొండ, పాలకుర్తి, కరీంనగర్, చార్మినార్ క్లస్టర్, హైదరాబాద్ – రంగారెడ్డి – మేడ్చల్ క్లస్టర్ గా విభజన చేశారు. ఎకో-వెల్నెస్ గా సిద్దిపేట, నల్లమల సర్క్యూట్, శ్రీరామ్ సాగర్, జన్నారం, గిరిజన (ట్రైబల్) సర్క్యూట్, నాగార్జున సాగర్, వికారాబాద్, మహబూబ్ నగర్,హస్తకళలు కింద పోచంపల్లి, నారాయణపేట, గద్వాల – కొత్తకోట, అదే విధంగా జల సర్క్యూట్లుగా కొరటికల్, కుంటాల‌, పొచ్చెర, గాయత్రి, బౌద్ధ సర్క్యూట్లుగా కొండాపూర్, ధూళికట్ట, కారుకొండ, నేలకొండపల్లి, బుద్ధవనం, ఫణిగిరి, గాజులబండ లో విడుతల వారీగా అభివృద్ధి పనులు చేపట్టబోతున్నారు.

Also read: మేడిపల్లిలో వరుస చోరీలు కలకలం.. భయంతో జంకుతున్న స్ధానికులు

ఖమ్మం జిల్లాకు సింహభాగం

Advertisement

టూరిజంశాఖ ఈ మొత్తంప్రాజెక్టులో ఖమ్మం జిల్లా పర్యాటకానికి పెద్దపీట వేశారు. జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను బలోపేతం చేసేందుకు ఏకంగా ₹93 కోట్లను కేటాయించారు. సీతారామ ప్రాజెక్టు పరిసరాలు, లంకసాగర్ వంటి ప్రాంతాలు సరికొత్త హంగులు అద్దుకోనున్నాయి.జిల్లాను పర్యాటక హబ్‌గా మార్చడమే లక్ష్యంగా ఇక్కడ పనులు జరగనున్నాయి.నిధుల వినియోగంలో పారదర్శకత, పనుల్లో నాణ్యత కోసం టూరిజం శాఖ విడతల వారీగా పనులను చేపట్టాలని నిర్ణయించింది. ఇప్పటికే రాష్ట్రంలోని కొన్ని పర్యాటక ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు టెండర్ నోటీఫికేషన్ సైతం ఇవ్వగా, టెండర్ లు సైతం వచ్చినట్లు సమాచారం. ఆలస్యం కాకుండా ఉండేందుకు కొన్ని కీలక ప్రాజెక్టులకు ఇప్పటికే టెండర్ నోటిఫికేషన్లు జారీ చేశారు.భూసేకరణ లేదా ఇతర సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సమాచారం.

ప్రత్యేక ప్రణాళికలు

అన్ని టూరిజం ప్రాంతాల్లో ఒకేసారి కాకుండా, ప్రాధాన్యత క్రమంలో విడతల వారీగా అభివృద్ధి పనులు పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అలా అయితేపనుల్లో నాణ్యత తగ్గకుండా, ఎలాంటి ఆటంకాలు కలగకుండా సాగేలా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించినట్లు తెలిసింది. “తెలంగాణ పర్యాటక రంగం కేవలం విహారయాత్రలకు పరిమితం కాకుండా, స్థానికులకు ఉపాధినిచ్చేలా, రాష్ట్ర ఆదాయాన్ని పెంచేలా ఈ ప్రాజెక్టును డిజైన్ చేసినట్లు సమాచారం.రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు పర్యాటక రంగం వెన్నుముకగా మారాలన్న లక్ష్యంతో ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఈ ప్రాజెక్టులు పూర్తయితే తెలంగాణ పర్యాటక మ్యాప్‌లో ఈ 10 జిల్లాలు మకుటాయమానంగా నిలవడం ఖాయం. తెలంగాణ పర్యాటక రంగం సరికొత్త రూపురేఖలను సంతరించుకోనుంది.

Also Read: పచ్చని సంసారంలోకి మూడో వ్యక్తి వస్తే.. ఆసక్తిగా సాగుతున్న జగపతిబాబు ‘వదలా’టీజర్!

Related News

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

JNTUH Inspections: మేడ్చల్‌లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్‌టీయూహెచ్ దాడులు!

El Niño Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఎన్నడూ లేని కరువు గండం..!

Transfers: అటవీ శాఖ ఉద్యోగులకు బిగ్ షాక్.. ఇటీవల జరిగిన బదిలీలు రద్దు!

Telangana PCC: ఢిల్లీని షేక్ చేస్తున్న తెలంగాణ.. టీపీసీసీకి రాహుల్ గాంధీ సీక్రెట్ టాస్క్..?

Hyderabad: పైరవీలకు చెక్.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, ముఖ్యనేతలకు కీలక సూచనలు

వారెవ్వా గోల్కొండ! భక్తులతో కిక్కిరిసిన కోట.. అధికారుల ఏర్పాట్లు ఎలా ఉన్నాయంటే?

Big Stories

Advertisement
×