BigTV English

Huzurabad Crime : టిప్పర్ బోల్తా.. మట్టిలో కూరుకుపోయి ముగ్గురు దుర్మరణం

Huzurabad Crime : టిప్పర్ బోల్తా.. మట్టిలో కూరుకుపోయి ముగ్గురు దుర్మరణం

Huzurabad Accident Update


Huzurabad Accident Update (Today Breaking news in Telangana): కరీంనగర్ లో ఘోర ప్రమాదం జరిగింది. హుజురాబాద్ సమీపంలో జరిగిన ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. మృతుల్లో అన్నాచెల్లెళ్లు కూడా ఉన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దమ్మతల్లి బోనాల జాతరకు వెళ్లి తిరిగి బైక్ పై ఇంటికి వెళ్తున్నారు. హుజురాబాద్ మండలం బోర్నపల్లి మూలమలుపువద్ద మట్టిలోడ్ తో వస్తున్న టిప్పర్ అదుపుతప్పి తిరగబడటంతో ఆ మట్టి బైక్ పై వెళ్తున్న ముగ్గురిపై పడింది.

Also Read : చల్లటి కబురు.. రేపట్నుంచి వర్షాలు.. హైదరాబాద్ లో మాత్రం ?


ముగ్గురూ మట్టిలో కూరుకుపోయారు. అప్రమత్తమైన స్థానికులు మట్టిని తీసి వర్ష, విజయ్, సింధుజలను ఆస్పత్రికి తరలించారు. అప్పటికే విజయ్, సింధుజ మరణించగా.. వర్ష చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతులంతా బోర్నపల్లికి చెందినవారేనని పోలీసులు తెలిపారు. విజయ్, వర్షలను అన్నచెల్లెళ్లుగా గుర్తించారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు హుజురాబాద్ ఏరియా ఆస్పత్రికి చేరుకున్నారు. ప్రమాదంలో ఇద్దరు పిల్లలు మృతి చెందడంతో విజయ్, వర్షల తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధిస్తున్నారు. ఈ ముగ్గురి మృతదేహాలకు హుజురాబాద్ ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం చేయనున్నారు. పోలీసులు ప్రమాదంపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు.

 

 

Tags

Related News

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Big Stories

×