BigTV English

Hanuman: మరో మూడు భాషల్లో హనుమాన్‌.. అక్కడ ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో..?

Hanuman: మరో మూడు భాషల్లో హనుమాన్‌.. అక్కడ ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో..?
HanuMan
HanuMan

Hanuman: సంక్రాంతికి రిలీజ్ అయినా ఓ సినిమా ఎన్నో రికార్డులను క్రియేట్ చేస్తుందని ఎవరూ ఊహించలేదు. ఒక సాదా సీదాగా.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చింది. బాక్సాఫీసు వద్ద భారీ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. అదే హనుమాన్ మూవీ. ఆ హనుమాన్ ఆశీస్సులతో రిలీజ్ అయిన ఈ హనుమాన్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకుంది.


సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక అదే రోజు మహేశ్ బాబు గుంటూరు కారం రిలీజ్ కావడంతో హనుమాన్‌కు థియేటర్లు కరువయ్యాయి. అయినా మూవీ యూనిట్ ఎక్కడా తగ్గలేదు. ఇచ్చిన కొన్ని థియేటర్లలో అయినా తమ క్రియేటివిటీ ఏంటో, తమ టాలెంట్ ఏంటో చూపిస్తామంటూ అతి తక్కువ థియేటర్లలో రిలీజ్ చేశారు.

రిలీజ్ అయిన ఫస్ట్ షో నుంచే హనుమాన్‌కు భారీ రెస్పాన్స్ వచ్చింది. మరోవైపు గుంటూరు కారం మూవీ రొటీన్ స్టోరీ, క్యారెక్టర్లతో ఉండటంతో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో హనుమాన్‌కు మరింత హైప్ వచ్చింది. ఈ సినిమా చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు పరుగులు పెట్టారు.


Also Read:  ఛ.. సమంత కామెంట్‌కు ఆ స్టార్ హీరోయిన్ రిప్లై ఇవ్వలేదేంటి..?

ఈ కారంణంగానే హనుమాన్ మూవీకి భారీ కలెక్షన్లు వచ్చాయి. దర్శకుడు ప్రశాంత్ వర్మ క్రియేటివిటీకి ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రియులు మంత్రముగ్దులయ్యారు. ఇక థియేటర్ అనంతరం ఓటీటీలోకి వచ్చి కూడా సూపర్ డూపర్ రెస్పాన్స్ అందుకుంది. అయితే ఇప్పటికి ఈ మూవీ తెలుగు వెర్షన్ జీ5లో, హిందీ వెర్షన్ జియో సినిమాలో స్ట్రీమింగ్ అవుతుంది.

ఇప్పుడు మరో మూడు భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో తమిళం, కన్నడ, మలయాళం వంటి భాషల్లో స్ట్రీమింగ్‌‌కి వచ్చేసింది. మరి ఈ చిత్రాన్ని ఇప్పటికీ చూడలేని ఆ భాష ప్రేక్షకులు ఇప్పుడు చూసేయొచ్చు. దీంతో కొందరు ఓటీటీలో ఇప్పటి వరకు తెలుగు, హిందీ భాషల్లో అద్భుతమైన రెస్పాన్స్ అందుకున్న ఈ మూవీ ఇప్పుడు తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×