E-Paper
Advertisement

Puvvada Ajay Affidavit : పువ్వాడ అఫిడవిట్‌లో తప్పులు..! ఈసీకి తుమ్మల ఫిర్యాదు..

Puvvada Ajay Affidavit : పువ్వాడ అఫిడవిట్‌లో తప్పులు..! ఈసీకి తుమ్మల ఫిర్యాదు..

Puvvada Ajay Affidavit : బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ సమర్పించిన అఫిడవిట్లో తప్పులు ఉన్నాయని.. ఆయన నామినేషన్‌ను తిరస్కరించాలని కాంగ్రెస్‌ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు కోరుతున్నారు. ఈ విషయంపై ఖమ్మం రిటర్నింగ్ ఆఫీసర్‌కు ఫిర్యాదు చేశారు. ఆర్డీఓ ఆఫీస్‌కు తుమ్మల వెళ్లి.. పువ్వాడ అజయ్ సమర్పించిన నామినేషన్, ఎన్నికల సంఘం ఫార్మాట్ కు భిన్నంగా ఉందంటూ లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.

బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ ఆఫిడవిట్ ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ లో లేదని.. ఫార్మాట్ మార్చడంపై రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశానని తుమ్మల చెప్పారు. ఎన్నికల సంఘం ఇచ్చిన ఫార్మాట్‌లో కాకుండా పువ్వాడ అజయ్ మార్చి ఇచ్చారని ఆరోపించారు. దాంతోపాటు అఫిడవిట్ లో డిపెండెంట్ కాలమ్ మార్చారన్నారు. డిపెండెంట్ కాలమ్‌లో ఎవ్వరు లేకపోతే నిల్ అని రాయకుండా మార్చారని.. నాలుగు సెట్స్ నామినేషన్లు కూడా తప్పులుగా ఉన్నాయని ఆయన చెప్పారు.

ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ లో లేకపోతే నామినేషన్ రిజెక్ట్ చేయాలని రిటర్నింగ్ అధికారిని అడిగానని తెలిపారు. అయితే తన నిర్ణయమే ఫైనల్‌ అని రిటర్నింగ్ అధికారి చెప్పారన్నారు తుమ్మల. ఎన్నికల నిబంధనలు పాటించలేదని.. ఆర్ఓపై ఎన్నికల సంఘనికి ఫిర్యాదు చేస్తానని.. అవసరమైతే న్యాయస్థానంలో కూడా పోరాటం చేస్తానని తుమ్మల స్పష్టం చేశారు.

Tags

Related News

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Telangana in Debt Trap | తెలంగాణ ఆర్థిక పరిస్థితి దయనీయం.. రుణ వడ్డీల చెల్లింపులకే భారీగా ఖర్చు

Big Stories

×