
Sparrow War In China : అది 1949. మావో జెడాంగ్ చైనా పాలనా పగ్గాలు స్వీకరించిన తొలిరోజులు. దేశంలో చెప్పలేనంత పేదరికం. అందరికీ ఒకపూట కడుపునిండా తిండి కూడా దొరకని రోజులవి. తన కమ్యూనిస్టు ప్రభుత్వం ఆధ్వర్యంలో దేశాన్ని వ్యవసాయ పరంగా నంబర్ వన్‌గా తీర్చిదిద్ది, ఆకలిని పారదోలాలనే ఆలోచనలో మావో పలు ఆలోచనలు చేస్తున్న సందర్భం అది. అటు దేశ ప్రజలు కూడా మావో నాయకత్వం మీద అపారమైన నమ్మకంతో ఆయనను రెండో ఆలోచన లేకుండా ఆరాధించటం, అనుసరిస్తున్న కాలమది.
ఆ సమయంలో ఒకరోజు మావో తన ప్రయాణ సందర్భంగా పిచుకల గుంపు ఒకటి.. పంటపొలం మీద పడి గింజలు తినటం చూశాడు. వెంటనే ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. దేశ వ్యాప్తంగా పండే పంటల్లో పిచుకల వల్ల నష్టపోతున్నదెంతో లెక్కతీయమని ఆదేశాలు జారీచేశాడు. ఒక పిచుక తన జీవితకాలంలో సుమారు ఆరున్నర కిలోల ధాన్యం తింటోందని సాగు విభాగం వారు చెప్పుకొచ్చారు. లక్షల టన్నుల ధాన్యం పిచుకల పాలవుతోందనే అంచనా కొచ్చిన మావో.. వెంటనే పిచుకలను చంపేయమని దేశ ప్రజలకు పిలుపునిచ్చాడు.

‘వద్దు బాబోయ్.. ఇలా చేస్తే.. పర్యావరణ పరంగా నష్టం తప్పదు’ అని నిపుణులు మొత్తుకున్నా.. మావో మీద నమ్మకంతో జనం వారి మాటలను కొట్టిపారేశారు. ఇక.. జనం పిచుక గూళ్లు పీకి పారేసి, గుడ్లు పగల కొట్టటం, పొలాల్లో పెద్దపెద్ద శబ్దాలు చేసి వాటిని తరమటంతో ఏడాదిలో వాటి సంఖ్య తగ్గిపోయింది. మరుసటి ఏడాదికి అవి కనిపించటం మానేశాయి.
అయితే.. పిచుకలు లేకపోవటంతో మిడదలు, కీటకాల సంఖ్య వందల రెట్లు పెరిగి.. అవన్నీ పంటపొలాల్లో ఒక్క గింజ లేకుండా తినిపారేయటం మొదలుపెట్టాయి. దీంతో దేశంలో ఘోరమైన కరువు వచ్చింది. ఈ కరువు దెబ్బకి దేశంలో నాలుగున్నర కోట్ల ఆకలిచావులు సంభవించాక.. పాలకులకు వాస్తవం బోధపడింది. దీంతో పొరుగునున్న సోవియట్ రష్యా నుంచి మూడు లక్షల పిచుకలను తీసుకొచ్చారు.
ప్రకృతి సమతుల్యతను దెబ్బతీస్తే ఏం జరుగుతుందనే దానికి ఈ ఉదంతం మంచి ఉదాహరణగా చరిత్రలో నిలిచిపోయింది.
Pawan Kalyan: ఓడిపోయాను..ఫెయిల్యూర్ పొలిటిషీయన్ ను.. నెక్ట్స్ ఏంటి..?