TS DSC 2024 Key: తెలంగాణలో టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన డీఎస్సీ పరీక్ష ప్రాథమిక కీ విడుదలైంది. స్కూల్ అసిస్టెంట్, లాంగ్వేజ్ పండిట్, సెకండరీ గ్రేడ్ టీచర్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులకు సంబంధించిన కీ, రెస్పాన్స్ షీట్లను పాఠశాల విద్యాశాఖ అధికారులు విడుదల చేశారు. అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్‌లో కీ చెక్ చేసుకోవడంతో పాటు రెస్పాన్స్ షీట్‌లను పొందవచ్చు. అభ్యర్థులు కీపై అభ్యంతరాలను ఆగస్టు 20 వరకు తెలిపేందుకు అవకాశం ఇచ్చారు.
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 11, 062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి జులై 18 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు 2,45,263 మంది అభ్యర్థులు హాజరయ్యారు.