E-Paper
Advertisement

TS Elections 2023 : సీఎం రేసులో కిషన్ రెడ్డి లేరు.. మురళీధర్ రావు కీలక వ్యాఖ్యలు

TS Elections 2023 : సీఎం రేసులో కిషన్ రెడ్డి లేరు.. మురళీధర్ రావు కీలక వ్యాఖ్యలు
bjp news in telangana

TS Elections News(BJP news in telangana):

తెలంగాణ బీజేపీ నేత మురళీధర్‌రావు చేసిన కామెంట్స్‌ రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారాయి. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ముఖ్యమంత్రి రేసులో లేరని.. ఆ రేసులో బండి సంజయ్‌ ఉన్నారని.. అందుకే ఆయనను అధ్యక్ష పదవి నుంచి తప్పించారని అన్నారు. అలాగే బీజేపీని వీడి కాంగ్రెస్ లో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరిగి బీజేపీ గూటికి చేరుతారని ధీమా వ్యక్తం చేశారు.

తెలంగాణపై కాషాయ జెండాను ఎగురవేసేందుకు వ్యూహాలు రచిస్తున్న కమలనాథులు.. బీసీ మంత్రాన్ని జపిస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే బీసీనే ముఖ్యమంత్రిని చేస్తామంటూ ప్రకటించారు. దీంతో బీసీ నేతలైన బండి సంజయ్‌, ఈటలలో ఎవరో ఒకరు సీఎం అవడం ఖాయమనే వార్తలు జోరందుకున్నాయి. ఇలాంటి సమయంలో మురళీధర్‌రావు వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈటల కోసమే పార్టీ ఇమేజ్‌ను ఫణంగా పెట్టారన్న గుసగుసలు కూడా వినిపిస్తాయి. ఇక మరోవైపు గతంలో బండి సంజయ్ వర్సెస్‌ ఈటల రాజకీయాలు అంతర్గత పోరు సాగినట్టు జరిగిన ప్రచారంతో ఈటలను తప్పించే విధంగా మురళీధర్‌ వ్యాఖ్యానించారన్న విమర్శలు వెల్లువెత్తాయి.

బండి సంజయ్‌ను పార్టీ నుంచి తప్పించిన తర్వాతే బీజేపీ బలహీనపడిందన్న ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలోనే రాజగోపాల్‌రెడ్డి, వివేక్‌లు పార్టీని వీడారని.. మరికొందరు నేతలు కూడా పక్క చూపులు చూస్తున్నారన్న వార్తలతో.. పార్టీ కేడర్ లో విశ్వాసం నింపేందుకు మురళీధర్‌రావు ఈ వ్యాఖ్యలు చేశారన్న టాక్‌ వినిపిస్తోంది. ఏది ఏమైనప్పటికీ సీఎం రేసులో బండి సంజయ్‌ ఉన్నారన్న వార్త ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది.

.

.

Related News

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Telangana in Debt Trap | తెలంగాణ ఆర్థిక పరిస్థితి దయనీయం.. రుణ వడ్డీల చెల్లింపులకే భారీగా ఖర్చు

Big Stories

×