E-Paper
Advertisement

TSRTC: ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ షాక్.. జనవరి 1 నుంచి ఆ టికెట్లు నిలిపివేత..

TSRTC: ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ షాక్.. జనవరి 1 నుంచి ఆ టికెట్లు నిలిపివేత..
Advertisement

TSRTC: మహాలక్ష్మి పథకంతో తెలంగాణ మహిళా ప్రయాణికులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఉచిత ప్రయాణాలతో ఆర్టీసీ బస్సులు ఎప్పుడు చూసినా.. ప్రయాణికులతో కిక్కిరిసి ఉంటున్నాయి. ఉన్న బస్సులు రద్దీగా ఉండటంతో.. ఇటీవలే 80 కొత్త బస్సుల్ని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. కొత్తబస్సుల్ని ప్రారంభించారని సంతోషించే లోగా.. టీఎస్ ఆర్టీసీ ప్రయాణికులకు ఊహించని షాకిచ్చింది.

కొత్తసంవత్సరం ప్రారంభం నుంచి.. అంటే జనవరి 1వ తేదీ నుంచి ఫ్యామిలీ-24, టి-6 టికెట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. ఆర్టీసీలో మహిళా ప్రయాణికుల సంఖ్య విపరీతంగా పెరగడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మహిళా ప్రయాణికుల రద్దీ కారణంగా.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జారీ చేసే ఫ్యామిలీ-24, టి-6 టికెట్లను పూర్తిగా నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించారు.

Advertisement

ఈ రెండు టికెట్లను ప్రయాణికులకు జారీ చేయాలంటే.. కండర్లు వారి గుర్తింపు కార్డులను చూసి.. వయసు నమోదు చేయాల్సి ఉంటుంది. మహాలక్ష్మి పథకంతో మహిళలకు టికెట్లు జారీ చేసేందుకే కండర్లకు ఎక్కువ సమయం పడుతోంది. అలాగే ప్రయాణికులకు అసౌకర్యం కలుగుతోంది. ప్రయాణికులకు అసౌకర్యం కలిగించవద్దన్న ఉద్దేశ్యంతోనే ఫ్యామిలీ 24, టి6 టికెట్లను ఉపసంహరించాలని సంస్థ నిర్ణయించిందని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు.

.

Advertisement

.

Tags

Related News

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

Big Stories

Advertisement
×